RTC Bus Accident : విజయవాడలో బీఆర్‌టీఎస్ రోడ్డుపై ఆర్టీసీ బస్సు బీభత్సం.. ఇద్దరు మృతి
RTC Bus Accident : గుణదల పడవల రేవు సెంటర్ సమీపంలో సాయంత్రం వాకింగ్ చేసుకునే వారిపై ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందారు.
RTC Bus Accident : విజయవాడ బీఆర్‌టీఎస్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. గుణదల పడవల రేవు సెంటర్ సమీపంలో సాయంత్రం వాకింగ్ చేసుకునే వారిపై ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. గవర్నర్ పేట డిపో బస్సుగా స్థానికులు చెబుతున్నారు.
ఈ ప్రమాదంలో బస్సు కింద పడి ఇద్దరు అక్కడక్కడే మృతిచెందారు. మృతులు వంగర అప్పారావు, కోల సత్యబాబుగా గుర్తించారు.
స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృత దేహాలను పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.
Read Also : సిక్కోలులో వైసీపీని కోలుకోలేని దెబ్బతీసేలా వ్యూహం సిద్ధం చేసిన టీడీపీ..!