Vijayawada: ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పరీక్షల్లో మళ్లీ మాల్ ప్రాక్టీస్ కలకలం.. పట్టుబడిన ఇద్దరు విద్యార్థులు
విజయవాడలోని సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలలో మళ్లీ మాల్ ప్రాక్టీస్ కలకలం రేపింది.

Medical Exam Malpractice
Vijayawada: విజయవాడలోని సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలలో మళ్లీ మాల్ ప్రాక్టీస్ కలకలం రేపింది. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పరీక్షల్లో శనివారం ఇద్దరు విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ కు పాల్పడ్డారు. రెండు రోజుల క్రితం జనరల్ మెడిసిన్ పరీక్షలో ముగ్గురు విద్యార్థులను మాల్ ప్రాక్టీస్ పాల్పడుతున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం గుర్తించి. అయితే, నిన్న మరోసారి పరీక్షలు రాస్తూ కాపియింగ్ కు పాల్పడుతూ విద్యార్థులు పట్టుబడటం చర్చనీయంశంగా మారింది.
Also Read: Amaravathi Rajadhani: అమరావతి రాజధాని విషయంలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ఈసారి 30వేల ఎకరాలు..
సిద్దార్థ ప్రభుత్వ వైద్య కళాశాల పరీక్ష కేంద్రంలో 90మంది జనరల్ మెడిసిన్ విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. వీరిలో ఎన్నారై వైద్య కళాశాలకు చెందిన విద్యార్థి, నిమ్రా వైద్య కళాశాలకు చెందిన మరో విద్యార్థి మాల్ ప్రాక్టీస్ కు పాల్పడ్డారు. ఆ ఇద్దరి విద్యార్థులను అదుపులోకి తీసుకొని వారి హాల్ టికెట్లు, ఐడెంటీ కార్డులు, ఆన్సర్ షీట్లను మాల్ ప్రాక్టీస్ కమిటీకి అధికారులు పంపించారు. స్వ్వాడ్ టీం, ఇన్విజిలేటర్స్ కళ్లుకప్పి పరీక్ష హాల్ లోకి స్లిప్స్, మొబైల్స్ ను విద్యార్థులు తీసుకెళ్లారు.