Attack on Doctor : కడుపునొప్పిగా ఉందని వచ్చి..చికిత్స చేస్తుంటే డాక్టర్ పై కత్తితో దాడి
డాక్టర్ గారూ..కడుపు నొప్పి అని వచ్చి చికిత్స చేసే డాక్టర్ పై దాడికి పాల్పడ్డాడో వ్యక్తి.

Attack On Rmp Docter (1)
Attack on RMP Doctor : విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. కడుపు నొప్పింగా ఉందని ఓయువకుడు హాస్పిటల్ కు వచ్చాడు.డాక్టర్ డాక్టర్..కడుపునొప్పిగా ఉందని చెప్పాడు.దాంతో డాక్టర్ గబగబా సదరు వ్యక్తికి చికిత్స చేయబోతుండగా హఠాత్తుగా కత్తితో దాడికి పాల్పడ్డాడు.వివరాల్లోకి వెళితే విజయవాడలోని రామలింగేశ్వర్ నగరలో ఓ ఆర్ఎంపీ డాక్టర్ చిన్న క్లినిక్ పెట్టుకుని స్థానికంగా వైద్యం చేస్తుంటాడు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం ఓ వ్యక్తి ‘డాక్టర్ గారూ కడుపు నొప్పి భరించలేకపోతున్నాను అంటూ క్లినిక్ కు వచ్చాడు.
దాంతో ఆర్ఎంపీ డాక్టర్ సదరు వ్యక్తికి చికిత్స చేయటానికి అతని చేయి పట్టుకుని పరీక్ష చేస్తున్నాడు. అంతే చికిత్స చేయించుకోవటానికి వచ్చిన వ్యక్తి హఠాత్తుగా డాక్టర్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. డాక్టర్ చేతిమీద భుజం మీద కత్తితో దాడి చేశాడు. దీంతో డాక్టర్ పెద్దగా కేకలు వేయటంతో నిందితుడు పారిపోయాడు.
డాక్టర్ అరుపులు విని అక్కడికి వచ్చిన స్థానికులకు రక్తస్రావంతో పడి ఉన్న డాక్టర్ కనింపించాడు. దీంతో వెంటనే డాక్టర్ ను సమీపంలోని హాస్పిటల్ కు తీసుకెళ్లి చికిత్సనిందించారు. అనంతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసునమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. దీంట్లో బాగంగా ఆ వ్యక్తి గురించి ఆ ప్రాంతంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు.