Unscrupulous activities : ఆంధ్రాయూనివర్శిటీలో అసాంఘీక కార్యకలాపాలు

ఇంజనీరింగ్ క్యాంపస్ వెనుక ప్రాంతం చెట్లు పెరిగి నిర్మానుష్యంగా మారింది. ఇదే అదునుగా హిజ్రాలు ఆ ప్రాంతాన్ని అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మార్చేశారు.

Unscrupulous activities : ఆంధ్రాయూనివర్శిటీలో అసాంఘీక కార్యకలాపాలు

Andhra University

Updated On : May 28, 2022 / 9:36 AM IST

Unscrupulous activities : ప్రతిష్టాత్మక ఆంధ్రాయూనివర్శిటీ అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. వర్శిటీ ప్రాంగణంలోనే యధేచ్చగా వ్యభిచారం జరుగుతోంది. క్యాంపస్‌లో బెడ్లు, గుట్టలుగా కండోమ్‌ ప్యాకెట్లు దర్శనిమిస్తున్నాయి. అలాగే డ్రగ్స్‌ వినియోగం జరుగుతున్నట్టు తేలింది. చెట్ల మాటున మద్యం బాటిళ్లు వందల సంఖ్యలో లభ్యమయ్యాయి.

విశ్వవిద్యాలయంలోని ప్రాంగణాలను సుందరీకరించాలని అధికారులు నిర్ణయించారు. తుప్పలతో నిండిన ప్రాంతాన్ని వారం రోజులుగా శుభ్రం చేయిస్తున్నారు. ఇంజనీరింగ్‌ కాలేజ్‌ బాయ్స్‌ హాస్టల్‌ పరిసరాల్లో చెట్ల కుప్పలు తొలగింపు చేస్తుండగా కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు బయటపడ్డాయి.

Hyderabad Police : చదువు పేరుతో ఇండియాకొచ్చి వ్యభిచారం.. గుట్టురట్టు చేసిన హైదరాబాద్ పోలీసులు

క్యాంప్‌సలోకి గుర్తింపు కార్డు లేకుండా ఎవరైనా వస్తే వెనక్కి పంపించేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది హాస్టల్‌ పరిసరాలను మాత్రం పట్టించుకోవడం మానేశారు. దీంతో ఏపుగా పెరిగిన చెట్లపై మంచం మాదిరిగా తయారుచేసి, వాటిపై పరుపులు వేశారు. పైకి వెళ్లడానికి నిచ్చెనలు ఏర్పాటు చేశారు. వాటిని అద్దెకు ఇస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్నారు.

ఇంజనీరింగ్ క్యాంపస్ వెనుక ప్రాంతం చెట్లు పెరిగి నిర్మానుష్యంగా మారింది. ఇదే అదునుగా హిజ్రాలు ఆ ప్రాంతాన్ని అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మార్చేశారు. రోజూ హిజ్రాలు వస్తున్న విషయానికి విద్యార్ధులు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో.. చెట్లపై ఏకంగా పక్కలు ఏర్పాటు చేసే వరకు వెళ్లింది.