పవన్ కళ్యాణ్‌కు అక్కడొక గొంతు.. ఇక్కడ ఒక గొంతు: వల్లభనేని వంశీ

  • Published By: vamsi ,Published On : November 14, 2019 / 12:26 PM IST
పవన్ కళ్యాణ్‌కు అక్కడొక గొంతు.. ఇక్కడ ఒక గొంతు: వల్లభనేని వంశీ

Updated On : November 14, 2019 / 12:26 PM IST

జగన్ ప్రభుత్వం తీసుకుని వచ్చిన ఇంగ్లీష్ మీడియంపై విమర్శలు చేస్తున్న పవన్ కళ్యాణ్‌పై మండిపడ్డారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. డబ్బున్న వాళ్ల పిల్లలు అందరూ ఇంగ్లీష్ మీడియంలలో చదివిస్తున్నారు అని, పేదవాళ్లు ఇంగ్లీష్ మీడియంలలో చదవకూడదా? అని విమర్శించారు వంశీ. తెలుగును కాపాడే ధర్మం పేదోళ్లకే ఉందా? మీ పిల్లలను ఎందుకు తెలుగు మీడియంలలో చదవించట్లేదు? అని ప్రశ్నించారు వల్లభనేని వంశీ.

మన పిల్లలకు ఒక న్యాయం.. పేద పిల్లలకు ఓ న్యాయమా? అని ప్రశ్నించారు. అలాగే తెలుగు దేశం పార్టీ జాతీయ పార్టీ అయినప్పుడు తెలంగాణ ఆర్టీసీ ఉద్యమంలో చంద్రబాబు ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు వల్లభనేని వంశీ. అలాగే తన దగ్గరకు వచ్చిన ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేసేందుకు ముఖ్యమంత్రితో మాట్లాడుతానంటూ చెప్పిన పవన్ కళ్యాణ్ అక్కడ ఎందుకు ప్రశ్నించట్లేదు అని నిలదీశారు. ఆ రాష్ట్రంలో ఒక గొంతు.. ఇక్కడ ఒక గొంతు.. ఉందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్‌కు మద్దతు ఇస్తే నాకు వ్యక్తిగతంగా లాభం లేదు అని, కేసులకు భయపడను.. వాటికి కోర్టు ఉందని అన్నారు వంశీ. జగన్‌తో ఉంటే పేద ప్రజలకు మంచి చేయగలుగుతాను. అనే నమ్మకం ఉందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు వల్లభనేని వంశీ. రాజీనామా చేసి అయినా ప్రభుత్వానికి మద్దతు తెలుపుతానని, నియోజకవర్గం కోసం దేనికైనా సిద్ధం అన్నారు.