Venkatadri Express : భారీ వర్షాలకు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ దారి మళ్లింపు
చిత్తూరు కడప జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తోంది.

Venkatadri Express
Venkatadri Express : అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను దారి మళ్లిస్తోంది. నందలూరు-రాజంపేట మధ్య వరద ఉధృతి ఎక్కువగా ఉన్న కారణంగా కొన్ని ప్రాంతాలలో రైలు పట్టాలకు మరమ్మతు పనులు జరుగుతున్నాయి.
దీంతో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ను దారి మళ్ళించారు. ప్రస్తుతం తిరుపతి నుంచి వెళ్లేందుకు వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు పాకాల జంక్షన్ లో రైలు ఎక్కాలని రైల్వే శాఖ కోరుతోంది.
Also Read : ACB Raids : విజిలెన్స్ అధికారులకు చిక్కిన రెవెన్యూ ఆఫీసర్