ఈవీఎంల రక్షణకు కేంద్ర బలగాలను వినియోగించాలి : ఎంపీ విజయసాయి రెడ్డి
కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి లేఖ రాశారు.

కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి లేఖ రాశారు.
కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి లేఖ రాశారు. ఈవీఎంల రక్షణకు కేంద్ర బలగాలను వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద సీఆర్ పీఎఫ్, సీఐఎస్ ఎఫ్ బలగాలను మోహరించాలన్నారు. అన్ని స్ట్రాంగ్ రూమ్ లలో 24 గంటలు సీసీ కెమెరాలు పనిచేసేలా అమర్చాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబే నేరుగా సీఈవోకు చెబుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కేంద్ర ఎన్నికల సంఘానికి సహకరించడం లేదన్నారు. రాష్ట్ర పోలీసులకు బదులు కేంద్ర పోలీసులనే స్ట్రాంగ్ రూమ్ ల దగ్గర కాపాలాగా ఉంచాలని కోరారు. ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా నిర్వహించినందుకు సీఈసీకి విజయసాయిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.