Rayana Bhagyalakshmi : పేదలకు ఇళ్లు నిర్మించాలన్న జగన్ సంకల్పానికి దేవుడు అండగా నిలిచారు : మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడలో 30 వేల మందికి పైగా అమరావతిలో ఇళ్లను పొందారని చెప్పారు. విజయవాడలోని పేదలు అమరావతిలో ఉండకూడదా అని పేర్కొన్నారు.

Rayana Bhagyalakshmi
Vijayawada Mayor Rayana Bhagyalakshmi : పేదలకు, పెత్తందారులకు అమరావతిలో యుద్ధం జరుగుతోందని, ఈ యుద్ధంలో పేదలే గెలుస్తారని విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. అమరావతిలో అర్హులైన లబ్ధిదారుల ఇళ్లకు శంకుస్ధాపనలు చేయడంతోపాటు ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి ఇస్తామని చెప్పారు. పేదలకు ఇల్లు నిర్మించాలన్న జగన్ సంకల్పానికి దేవుడు అండగా నిలిచారని తెలిపారు. ఈ మేరకు ఆదివారం మేయర్ రాయన భాగ్యలక్ష్మి 10టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు.
సోమవారం అమరావతిలోని కృష్ణాయపాలెంలో పేదలందరికీ ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్ధాపన చేయనున్నారు. విజయవాడలో లబ్ధిదారుల ఇళ్లకు రాయన భాగ్యలక్ష్మి వెళుతున్నారు. విజయవాడలో లబ్ధిదారులైన మహిళలకు బొట్టు పెట్టి అమరావతిలో ఇళ్ళ శంకుస్ధాపనకు కుటుంబ సమేతంగా రావాలని మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆహ్వానిస్తున్నారు.
Anagani Satyaprasad : వీఆర్ఏ, వీఆర్వోలను వేధిస్తున్న వైసీపీ ప్రభుత్వం : ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్
దుష్ట చతుష్టయం ఎన్ని కుతంత్రాలు పన్నినా పేదలే గెలిచారని పేర్కొన్నారు. విజయవాడలో 30 వేల మందికి పైగా అమరావతిలో ఇళ్లను పొందారని చెప్పారు. విజయవాడలోని పేదలు అమరావతిలో ఉండకూడదా అని పేర్కొన్నారు. కోర్టు కేసులు వేస్తూ ఎందుకు అన్ని కుతంత్రాలు పన్నుతున్నారని ప్రశ్నించారు. సీఎం జగన్ హయాంలో పేదలకు అమరావతిలో ఇళ్లస్ధలాలు ఇవ్వడమే కాకుండా నిర్మించి ఇస్తామని వెల్లడించారు.