సుప్రభాత సేవ తర్వాత భవానీ దీక్షల విరమణ ప్రారంభం: దుర్గ గుడి ఈవో
యాప్‌లో లడ్డూలు బుక్ చేసుకున్న వారికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు.

vijayawada Kanaka Durga Temple
భవానీ దీక్షల విరమణకు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో భవానీ దీక్షల విరమణకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా దుర్గ గుడి ఈవో రామారావు మాట్లాడుతూ… ఈ నెల 21 నుంచి 25 వరకు భవాని దీక్ష విరమణలు ఉంటాయన్నారు. 21వ తేదీ ఉదయం 6 గంటలకు దీక్ష విరమణ ప్రారంభం అవుతుందని తెలిపారు.
సుప్రభాత సేవ అయిన అనంతరం దీక్ష విరమణ ప్రారంభమవుతుందన్నారు. భవానీ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. అన్ని ఎమర్జెన్సీ సేవలు అందుబాటులోకి ఉన్నాయని అన్నారు. భక్తులందరికీ ఫ్రీ దర్శనం కల్పిస్తున్నామని తెలిపారు.
సుమారు భక్తులు ఐదు లక్షల నుంచి ఆరు లక్షల మంది వస్తారని అన్నారు. భక్తులకు లడ్డూలు కూడా అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ప్రస్తుతం ఐదు లక్షల లడ్డూలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. భవానీ దీక్షలు 2024 యాప్ కూడా ప్రవేశపెట్టామని అన్నారు. యాప్ లోనే లడ్డూలు కూడా బుక్ చేసుకోవచ్చని తెలిపారు.
యాప్‌లో లడ్డూలు బుక్ చేసుకున్న వారికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. యాప్ ద్వారా అన్ని సదుపాయాలు పొందే అవకాశం ఉందని అన్నారు. యాప్ లో గిరి ప్రదక్షిణ మ్యాప్ ను కూడా సూచిస్తున్నామని తెలిపారు. వీఐపీ దర్శనాలు అంతరాలయ దర్శనాలు రద్దు చేశామని చెప్పారు. భవాని దీక్ష విరమణకు వచ్చే భక్తులు యాప్ ను సద్విని చేసుకోవాలని అన్నారు.