Hindus in Bangladesh: పాకిస్థాన్‌లో కంటే బంగ్లాదేశ్‌లో హిందువులపై హింస 20 రెట్లు ఎక్కువ: కేంద్ర ప్రభుత్వం
బంగ్లాదేశ్‌లో ముఖ్యంగా షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత దాడులు హిందువులపై దాడులు మరింత పెరిగాయని తెలిపింది.

Hindus In Bangladesh
పాకిస్థాన్‌లో కంటే బంగ్లాదేశ్‌లో హిందువులపై హింస 20 రెట్లు ఎక్కువగా ఉందని రాజ్యసభకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దాడులకు సంబంధించి 2,200 కేసులు, పాకిస్థాన్‌లో 112 కేసులు నమోదయ్యాయని చెప్పింది.
బంగ్లాదేశ్‌లో ముఖ్యంగా షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత దాడులు హిందువులపై దాడులు మరింత పెరిగాయని తెలిపింది. హిందువులపై దాడులకు సంబంధించిన బంగ్లాదేశ్, పాకిస్థాన్‌కు లేఖలు రాసినట్లు చెప్పింది.
హిందువుల భద్రత, సంక్షేమం, శ్రేయస్సుకు భరోసా ఇవ్వాలని ఆయా దేశాల ప్రభుత్వాలను కేంద్ర సర్కారు కోరింది. కేంద్ర సర్కారు విడుదల చేసిన డేటా ప్రకారం.. బంగ్లాదేశ్‌లో 2022లో హిందువులపై 47 హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. 2023లో 302.. అలాగే, 2024లో (డిసెంబర్ 8, 2024 వరకు) 2,200 వరకు హింసాత్మక ఘటనలు జరిగాయి.
పాకిస్థాన్‌లో 2022లో హిందువులపై 241 హింసాత్మక ఘటనలు, 2023లో 103, అలాగే, 2024లో (అక్టోబర్ వరకు) 112 ఘటనలు చోటుచేసుకున్నాయి. బంగ్లాదేశ్, పాకిస్థాన్ మినహా ఇతర పొరుగు దేశాలలో హిందువులపై హింసాత్మక కేసులు నమోదు కాలేదని ప్రభుత్వం పేర్కొంది.
“డ్యాన్స్ అంటే ఇలా ఉండాలి” అనేలా బామ్మ, తాత డ్యాన్స్.. వీడియో చూశారా?