“డ్యాన్స్ అంటే ఇలా ఉండాలి” అనేలా బామ్మ, తాత డ్యాన్స్.. వీడియో చూశారా?
ఢిల్లీకి చెందిన డీజే సుఖ్‌బీర్ సింగ్ భాటియా ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా ఈ వీడియోకి మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి.

ఓ బామ్మ, తాత హుషారుగా డ్యాన్స్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో పంజాబీ పాట ‘కాలా ష కాలా’కు వారు డ్యాన్స్ చేశారు.
ఢిల్లీకి చెందిన డీజే సుఖ్‌బీర్ సింగ్ భాటియా ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా ఈ వీడియోకి మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. చాలా మంది 30 ఏళ్లకే ముసలివాళ్లలా కనపడుతుంటే ఈ తాత, బామ్మ మాత్రం 70 ఏళ్లు దాటినా యంగ్ కపుల్‌లా కనపడుతున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఈ వృద్ధులను చూసి యువత నేర్చుకోవాల్సింది చాలా ఉందని కొందరు కామెంట్లు చేశారు. వారు వృద్ధుల్లా కనపడడం లేదని, నవ యువకుల్లా కనపడుతున్నారని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. కుర్రకారులా ఈ వృద్ధులు డ్యాన్స్ చేస్తుంటే అది చూసి తాను కూడా డ్యాన్స్ చేయకుండా ఉండలేకపోయాయని ఓ యూజర్ అన్నాడు.
View this post on Instagram
Ravichandran Ashwin : అప్పుడు ఇలా చెప్పిఉంటే గుండెపోటు వచ్చేదేమో : అశ్విన్