Vijayawada : బాలిక ఆత్మహత్య కేసు.. వినోద్ జైన్ ఇల్లు సీజ్, బెదిరింపులే కారణమా ?

బాలిక ఎవరికీ ఫిర్యాదు చేయకుండా నేరుగా చనిపోవడానికి బెదిరింపులే కారణమా.? అన్న కోణంలో కూడా దర్యాప్తు చేపడుతున్నారు. విజయవాడ భవానీపురం కుమ్మరిపాలెం సెంటర్‌లో నివాసం ఉంటున్న బాలిక..

Vijayawada : బాలిక ఆత్మహత్య కేసు.. వినోద్ జైన్ ఇల్లు సీజ్, బెదిరింపులే కారణమా ?

Vijayawada

Updated On : January 31, 2022 / 9:55 AM IST

Vijayawada Minor Girl Commits Suicide : విజయవాడలో బాలిక ఆత్మహత్య కేసు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రధాన ఆరోపణలు వెల్లువెత్తుతున్న టీడీపీ నేత వినోద్ జైన్ ను, అతని కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి విచారిస్తున్నారు. లోటస్ లోని వినోద్ జైన్ ఇంటికి భవానిపురం పోలీసులు వెళ్లి పరిశీలించారు. అనంతరం దానిని సీజ్ చేశారు. వినోద్ జైన్ కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్నారు. బాలిక మృతి అనంతరం వినోద్ ఎవరితో మాట్లాడాడు అన్న కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. అతని నివాసంలో ఉన్న సీసీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు లైంగిక వేధింపులతో పాటు బెదిరించాడా అన్నకోణంలో విచారిస్తున్నారు.

Read More : UP Bus Accident : యూపీలో ఘోర రోడ్డుప్రమాదం.. బస్సు బీభత్సం.. ఆరుగురు మృతి

బాలిక ఎవరికీ ఫిర్యాదు చేయకుండా నేరుగా చనిపోవడానికి బెదిరింపులే కారణమా.? అన్న కోణంలో కూడా దర్యాప్తు చేపడుతున్నారు. విజయవాడ భవానీపురం కుమ్మరిపాలెం సెంటర్‌లో నివాసం ఉంటున్న బాలిక.. బెంజి సర్కిల్‌ వద్ద గల ఓ స్కూల్ లో 9వ తరగతి చదువుతోంది. తనను ఓ వ్యక్తి కొన్ని రోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడని నోట్ బుక్‎లో రాసిన బాలిక.. అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read More : Unstoppable with NBK: అన్ స్టాపబుల్ బాలయ్య.. తెర వెనుక చిన్న కూతురు!

నిందితుడు వినోద్ జైన్ ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 37వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేశాడు. గత రెండు నెలల నుంచి బాలికను వినోద్ జైన్ వేధిస్తున్నాడని పలు సార్లు లైంగిక దాడికి కూడా పాల్పడ్డాడని బాలిక కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అతడి వేధింపులు తట్టుకోలేక బాలిక ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. బాలిక సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు వినోద్ పై పోక్సో కేసు నమోదు నమోదు చేసి అరెస్ట్ చేశారు. దీనిపై స్పందించిన టీడీపీ… వినోద్ జైన్ పై చర్యలు తీసుకుంది. అతడిని పార్టీ నుండి సస్పెండ్ చేసింది.