పవన్ కల్యాణ్ ఎంట్రీ.. యువతి మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు, 9 నెలల తర్వాత ఆచూకీ లభ్యం

యువతి మిస్సింగ్ కేసు వ్యవహారంలో పవన్ కల్యాణ్ స్వయంగా ఫోన్ చేసి సీఐతో మాట్లాడారు.

పవన్ కల్యాణ్ ఎంట్రీ.. యువతి మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు, 9 నెలల తర్వాత ఆచూకీ లభ్యం

Pawan Kalyan (Photo Credit : Facebook)

Updated On : July 2, 2024 / 7:27 PM IST

Missing Mystery : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంట్రీతో ఓ యువతి మిస్సింగ్ కేసులో మిస్టరీ వీడింది. యువతి ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. ఓ యువతి మిస్సింగ్ కేసును బెజవాడ పోలీసులు ఛేదించారు. దాదాపు 9 నెలల తర్వాత ఆ యువతి ఆచూకీ లభ్యమైంది. తమ కుమార్తె కనిపించడం లేదని భీమవరంకు చెందిన శివ కుమారి ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కి ఫిర్యాదు చేశారు. యువతి మిస్సింగ్ కేసు వ్యవహారంలో పవన్ కల్యాణ్ స్వయంగా ఫోన్ చేసి సీఐతో మాట్లాడారు. యువతి ఆచూకీ కనుగొనాలని సూచించారు. రంగంలోకి దిగిన పోలీసులు యువతి ఆచూకీ కనిపెట్టారు.

యువతి.. విజయవాడ రామవరప్పాడుకు చెందిన యువకుడితో జమ్మూలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. జమ్మూ నుంచి ఇద్దరినీ విజయవాడ తీసుకొస్తోంది స్పెషల్ టీం. పవన్ కల్యాణ్ ఆదేశాలతో యువతి మిస్సింగ్ కేసుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు నగర పోలీసు కమిషనర్.

Also Read : ఆపరేషన్ ద్వారంపూడి..! మాజీ ఎమ్మెల్యే చుట్టూ ఉచ్చు బిగిస్తున్న పవన్ కల్యాణ్..!