రాజధానిలో ఆందోళనలు : రాత్రి అయినా మహిళలను విడిచిపెట్టని పోలీసులు

  • Published By: madhu ,Published On : January 10, 2020 / 02:54 PM IST
రాజధానిలో ఆందోళనలు : రాత్రి అయినా మహిళలను విడిచిపెట్టని పోలీసులు

Updated On : January 10, 2020 / 2:54 PM IST

ఏపీ రాజధాని అమరావతిలో జరుగుతున్న ఆందోళనల్లో పోలీసుల చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అరెస్టు చేసిన మహిళలను ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్భందించడం కలకలం రేపుతోంది. చీకటి పడినా..మహిళలను విడుదల చేయడం లేదు. మహిళలను ఒక్కొక్కరిగా ఫొటోలు తీస్తున్నారు. ఆధార్ నెంబర్, ఇంటి అడ్రస్‌లు ఇస్తేనే..విడుదల చేస్తామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. దీంతో ఏమి చేయాలో తెలియక మహిళలు భయాందోళనలకు గురవుతున్నారు. 

రాజధానిలో ఆందోళనలు మరింత ఉధృతమౌతున్నాయి. మూడు రాజధానుల ప్రకటన, GN RAO కమిటీ ఇచ్చిన నివేదిక తర్వాత పరిస్థితులు మొత్తం మారిపోయాయి. 24 రోజులుగా ఎక్కడికక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి. మహిళలు పెద్ద ఎత్తున రోడ్డెక్కి ఆందోళనలు, నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ఈ సందర్భంగా మహిళలపై పోలీసులు ప్రవర్తిస్తున్న తీరును పలువురు ఎండగడుతున్నారు. అమరావతిలో మహిళా రైతులపై దాడి ఘటనను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. అమరావతికి నిజనిర్ధారణ కమిటీని పంపించనున్నట్లు ఈ మేరకు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ ట్వీట్ చేశారు. 

Read More : నేను దేశద్రోహినా : రాజదాని అడిగితే ఏం చెప్పాలి – బాబు