Vemana Indlu : ఆ గ్రామంలో ఎవరూ చెప్పులు వేసుకోరు.. అనారోగ్యం వస్తే ఆసుపత్రికి వెళ్లరు.. ఇంకా విడ్డూరం ఏంటంటే?

ఆ గ్రామంలో ఎవరూ చెప్పులు వేసుకోరు. బయట నుంచి గ్రామంలోకి వెళ్లిన వారిని తాకరు. అంతేనా .. ఇంకా అనేక వింతలు ఉన్నాయి. తిరుపతికి దగ్గర్లో ఉన్న ఆ గ్రామ విడ్డూరాలేంటో చదవండి.

Vemana Indlu : ఆ గ్రామంలో ఎవరూ చెప్పులు వేసుకోరు.. అనారోగ్యం వస్తే ఆసుపత్రికి వెళ్లరు.. ఇంకా విడ్డూరం ఏంటంటే?

Vemana Indlu

Vemana Indlu : బయటకు వెళ్లినప్పుడే కాదు.. ఇంట్లో కూడా కొందరు చెప్పులు వదలరు.. అలాంటిది ఆ గ్రామంలో ఎవరూ చెప్పులు వేసుకోరు. మనలాంటి వారు గ్రామం చూద్దామని వెళ్తే చెప్పులు గ్రామం బయటే విడిచిపెట్టాలి. ఇంతేనా? ఇంకా చాలా వింతలు ఉన్నాయి. చదవండి.

తిరుపతికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకాల మండలం ఉప్పర పల్లి పంచాయతీలోని ‘వేమన ఇండ్లు’. ఈ గ్రామం గురించి అందరూ వింతగా చెప్పుకుంటారు. ఆ ఊళ్లో ఎవరు చెప్పులు వేసుకోరు. కలెక్టర్ కాదు.. కాదు ముఖ్యమంత్రి వచ్చినా ఊరి బయట చెప్పులు విప్పి లోపలికి రావాల్సిందే. తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న సంప్రదాయమట.. ఆ గ్రామస్తులు వాటినే పాటిస్తూ వస్తున్నారు.

Assam : ఆ గ్రామంలో పక్షులు ఆత్మహత్య చేసుకుంటాయి.. ఆ వింత గ్రామం ఎక్కడంటే?

ఈ గ్రామంలోకి ఇతరులను ఎవరినీ అనుమతించరు. గ్రామంలో ఉండేవారంతా పాలవేకారి, దొరవర్లు కులానికి చెందిన వారిగా చెప్పుకుంటారట. క్రీ.పూ ఈ గ్రామంలో అందరూ ఒకే వంశానికి చెందినవారట. గ్రామస్తులంతా తమ ఆరాధ్య దైవం వేంకటేశ్వర స్వామిని కొలుస్తారు. గ్రామంలో లక్ష్మీ నరసింహ స్వామి, గంగమ్మ కూడా పూజలు అందుకుంటారు. వేంకటేశ్వరుడిపై ఉన్న భక్తితోనే తాము చెప్పులు వేసుకోవడం మానేశామని గ్రామస్తులు చెబుతారు. ఊరికి ఎవరు వచ్చిన కూడా చెప్పులు విడిచి గ్రామంలోకి రావాలి.

ఇంకా ఈ గ్రామంలోకి వచ్చిన కొత్తవారిని వారు తాకరు. బయటకు వెళ్లినా ఎన్ని రోజులు ఉండాల్సి వచ్చిన అక్కడి ఆహారాన్ని తినరు. ఎక్కడికి వెళ్లినా తిరిగి ఇంటికి వచ్చిన తర్వాతే ఆహారం తీసుకుంటారట. తిరుపతిలో శ్రీ వేంకటేశ్వరుడు కొలువుతీరినా గ్రామస్తులు అక్కడికి కూడా వెళ్లరట. ఎవరికైనా ఏ అనారోగ్యం వచ్చినా గ్రామంలో ఉన్న వేంకటేశ్వరుడి గుడిలో పూజలు చేస్తారు కానీ ఆసుపత్రికి మాత్రం వెళ్లరట. ఈ గ్రామంలో వారు కోవిడ్ టైమ్‌లో వ్యాక్సిన్ కూడా తీసుకోలేదట. తాము కొలిచే దేవుడే తమ ప్రాణాలు కాపాడతాడని నమ్ముతారట.

1 Village,2 Languages : మహిళలు ఒక భాష..పురుషులు మరొక భాష మాట్లాడే వింత గ్రామం

వేమన ఇండ్లు గ్రామంలో మొదట ఒకటే కుటుంబం ఉండేదట. ఆ తర్వాత 25 కుటుంబాలు ఉన్నాయి. ఈ గ్రామంలో పిల్లలు సైతం పెద్దవాళ్లు చెప్పినట్లు సంప్రదాయాలు పాటిస్తారట. కాలం మారిపోయినా ఇంకా వెనుబాటుతనంలో ఉండిపోయిన ఈ గ్రామం ఆచారాలు, సంప్రదాయాలపై అనేకమంది పెదవి విరుస్తున్నారు.