విశాఖలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై కొరడా, టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడికి చెందిన గోకార్ట్ రేసింగ్ తొలగింపు

  • Published By: naveen ,Published On : November 21, 2020 / 12:08 PM IST
విశాఖలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై కొరడా, టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడికి చెందిన గోకార్ట్ రేసింగ్ తొలగింపు

Updated On : November 21, 2020 / 12:59 PM IST

visakha illegal constructions: విశాఖలో ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నవారిపై ప్రభుత్వం కొరడా ఝళిపిస్తోంది. తాజాగా.. టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ముఖ్య అనుచరుడు కాశీ విశ్వనాథ్ కు చెందిన గోకార్ట్ రేసింగ్ ను అధికారులు తొలగిస్తున్నారు. కాపులుప్పాడలోని మంగమ్మవారిపేటలో కాశీ విశ్వనాథ్ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటున్నారు అధికారులు.




https://10tv.in/ap-patient-brain-operation-watching-big-boss-show-in-guntur/
సర్వే నెంబర్ 299/1, 301లలో ఉన్న 4 ఎకరాల 48 సెంట్లలో కట్టిన నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. CRZ అనుమతులు లేనందుకే కూల్చివేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.