CM Jagan: విశాఖ ఎయిర్‌పోర్టులో సీఎం జగన్‌ను కలిసిన విశాఖ ముఖ్య నేతలు
ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో ఉమ్మడి విశాఖ జిల్లా ముఖ్యనేతలు భేటీ అయ్యారు. జిల్లాల్లోని పార్టీ పదవులపై నేతలతో ముఖ్యమంత్రి చర్చలు జరిపినట్లు సమాచారం. కొత్త జిల్లా అధ్యక్షులను నియమించే..

Ap Cm Jagan
CM Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో ఉమ్మడి విశాఖ జిల్లా ముఖ్యనేతలు భేటీ అయ్యారు. జిల్లాల్లోని పార్టీ పదవులపై నేతలతో ముఖ్యమంత్రి చర్చలు జరిపినట్లు సమాచారం. కొత్త జిల్లాలకు అధ్యక్షులను నియమించే అవకాశం ఉందన్నట్లు సీఎం మాటల ద్వారా తెలిసిందని నేతలు అంటున్నారు.
అనకాపల్లి, విశాఖ, అరకు జిల్లాలకు కొత్త అద్యక్షులు వచ్చే అవకాశం ఉందని స్పష్టమైంది. ఈ క్రమంలోనే అనకాపల్లి జిల్లాకు కరణం ధర్మశ్రీ, విశాఖ జిల్లా అధ్యక్ష పదవిని అవంతికి అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అల్లూరి సీతారామరాజు జిల్లా నేతలంతా వేర్వేరుగా ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. సీఎం విశాఖ పర్యటన ముగిసిన అనంతరం తాడేపల్లిలో కొత్త జిల్లా అధ్యక్షులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.