VMC Pigs : పందుల ఏరివేతపై వీఎంసీ అధికారుల స్పెషల్ ఫోకస్

విజయవాడ నగరంలో ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్న పందులను ఏరివేసేందుకు నగరపాలక సంస్ధ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు.

VMC Pigs : పందుల ఏరివేతపై వీఎంసీ అధికారుల స్పెషల్ ఫోకస్

Vmc Pigs Special Drive

Updated On : June 15, 2021 / 1:32 PM IST

VMC Pigs : విజయవాడ నగరంలో ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్న పందులను ఏరివేసేందుకు నగరపాలక సంస్ధ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. కార్పోరేషన్ ఆరోగ్య విభాగం అధికారి రవిచంద్ నేతృత్వంలో చెన్నై నుంచి వచ్చిన 20 మంది సిబ్బంది నగరంలో పందుల ఏరివేత కార్యక్రమం చేపట్టారు.

విజయవాడలో సుమారు 3 వేలకు పైగా పందులు ఉన్నట్లు సమాచారం. ఈ బృందం వారంరోజుల్లో వాటినన్నిటినీ ఏరివేయనుంది. పందుల వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని  తమ దృష్టికి వచ్చిందని అందుకే ఈప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు నగరపాలక సంస్ధ అధికారులు తెలిపారు.