VRO Suicide : కాల్ మనీ వేధింపులు తాళలేక వీఆర్వో ఆత్మహత్య

కృష్ణా జిల్లా కొండపల్లిలో ఒక వ్యక్తిని కాల్‌మనీ కాటేసింది. కాల్‌మనీ వేధింపులు తాళలేక ప్రాణాలు తీసుకున్నాడు. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

VRO Suicide : కాల్ మనీ వేధింపులు తాళలేక వీఆర్వో ఆత్మహత్య

Suicide (2)

Updated On : November 30, 2021 / 12:30 PM IST

VRO suicide in Krishna district : ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వడ్డీ వ్యాపారలు ఆగడాలు, వేధింపులు ఆగడం లేదు. రోజూ ఎక్కడో చోట కాల్‌మనీ వేధింపులు, వాటిని తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా కృష్ణా జిల్లా కొండపల్లిలో ఒక వ్యక్తిని కాల్‌మనీ కాటేసింది. కాల్‌మనీ వేధింపులు తాళలేక ప్రాణాలు తీసుకున్నాడు. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

పోలీసుల కథనం ప్రకారం…గౌస్‌ అనే వ్యక్తి కొండపల్లి వీఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అసవరాల కోసం వడ్డీ వ్యాపారస్తుల దగ్గర గౌస్ కొంత అప్పు తీసుకున్నాడు. వడ్డీ డబ్బులు చెల్లిస్తున్నా.. వ్యాపారులు లక్షల్లో అప్పులు చూపించారు. కాల్‌మనీ వేధింపులు భరించలేక కొండపల్లిలోని అద్దె ఇంట్లో ఉరి వేసుకుని గౌస్‌ ఆత్మహత్య చేసుకున్నాడు.

Heavy Rains In Kadapa : కడప జిల్లాలో భారీ వర్షాలు, వరదలు..ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ

రూ.25 వేలు తీసుకుంటే.. మూడు లక్షలు చెల్లించమంటున్నారంటూ.. సూసైడ్‌ లెటర్‌ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్‌ లెటర్‌లో వడ్డీ వ్యాపారుల పేర్లు ప్రస్తావించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.