విశాఖ HPCL లో పొగలు…ఆందోళనలో ప్రజలు

విశాఖపట్నంలో గురువారం సాయంత్రం మరోసారి గ్యాస్ కలకలం ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. మల్కాపురంలోని HPCL రిఫైనరీలోని SHU ని తెరిచేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆ సమయంలో రిపైనరీ గొట్టాలనుంచి తెల్లని పొగ బయటకురావటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. పొగలు చూసిన ఎన్ఏడీ, మర్రిపాలెం,కంచరపాలెంకు చెందిన ప్రజలంతా ఇళ్లలోంచి బయటకు వచ్చారు. కొద్ది సేపటి తర్వాత పొగలు ఆగిపోవటంతో ప్రజలు ఊపిరిపీల్చుకుని ఎవరి ఇళ్ళలోకి వాల్లు వెళ్లిపోయారు.
మే 7వ తేదీ రాత్రి విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ లో స్టెరైన్ గ్యాస్ లీకై 12 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పలువురు అస్వస్ధతకు గురయ్యారు. మృతుల కుటుంబాలు ఒక్కోకరికి సీఎం జగన్ కోటి రూపాయలు నష్టపరిహారం ప్రకటించారు. వెంటిలేటర్ పై ఉన్నవారికి రూ.25లక్షలు అందిస్తామని సీఎం ప్రకటించారు.
ఆఘటన మరువక ముందే గురువారం HPCL రిఫైనరీలోంచి పొగలు రావటంతో ప్రజలు ఒకింత ఆందోళనకు గురయ్యారు. కాగా….ఈ ఘటనపై HPCL యాజమాన్యం స్పందిస్తూ…రిఫైనరీలో SHU ని తెరిచే క్రమంలో ఉష్ణోగ్రతలు పెరిగనట్లు గుర్తించామని.. ఇప్పడు పరిస్ధితి అదుపులోనే ఉందని వివరించారు.