Suspense On Narsapuram MP Candidate : నరసాపురం ఎంపీ టికెట్‌పై బీజేపీలో తీవ్ర ఉత్కంఠ

వైసీపీ ఎంపీ టికెట్ ను బీసీ శెట్టిబలిజ మహిళ గూడూరి ఉమాబాలకు ఇవ్వడంతో అదే సామాజిక వర్గానికి చెందిన పాకా సత్యనారాయణకు బీజేపీ ఎంపీ టికెట్ ఇస్తుందని ప్రచారం నడుస్తోంది.

Suspense On Narsapuram MP Candidate : నరసాపురం ఎంపీ టికెట్‌పై బీజేపీలో తీవ్ర ఉత్కంఠ

Updated On : March 24, 2024 / 5:20 PM IST

Suspense On Narsapuram MP Candidate : పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీ టికెట్ పై బీజేపీలో ఉత్కంఠ కొనసాగుతోంది. నరసాపురం ఎంపీ టికెట్ రేసులో మొదటి నుండి ఎంపీ రఘురామకృష్ణ రాజు పేరు వినిపిస్తోంది. అనకాపల్లి నుంచి తానే పోటీ చేస్తానంటూ పలుమార్లు ప్రకటించుకున్నారు రఘురామకృష్ణరాజు. ఇదే ఇదే సీటు కోసం బీజేపీ నేత భూపతిరాజు శ్రీనివాసవర్మ సైతం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

అటు దివంగత కేంద్రమంత్రి కృష్ణం రాజు సతీమణి లేదా ఆయన మేనల్లుడు ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. వైసీపీ ఎంపీ టికెట్ ను బీసీ శెట్టిబలిజ మహిళ గూడూరి ఉమాబాలకు ఇవ్వడంతో అదే సామాజిక వర్గానికి చెందిన పాకా సత్యనారాయణకు బీజేపీ ఎంపీ టికెట్ ఇస్తుందని ప్రచారం నడుస్తోంది. మొత్తంగా నరసాపురం ఎంపీ అభ్యర్థి ఎవరు? అనేది హాట్ టాపిక్ గా మారింది. అధిష్టానం ప్రకటన కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు.

Also Read : అనకాపల్లి నుంచి సీఎం రమేశ్, ధర్మవరం నుంచి సత్యకుమార్? ఏపీ బీజేపీ అభ్యర్థులు వీళ్లే?