AP Bjp Candidates List : అనకాపల్లి నుంచి సీఎం రమేశ్, ధర్మవరం నుంచి సత్యకుమార్? ఏపీ బీజేపీ అభ్యర్థులు వీళ్లే?

రైల్వేకోడూరు, కైకలూరు, అనపర్తి, జడ్చర్ల, అనంతపురం సిటీ, చిత్తూరు జిల్లాలోని ఒక అసెంబ్లీ స్థానంలో కమలం పార్టీ పోటీ చేస్తుందని సమాచారం.

AP Bjp Candidates List : అనకాపల్లి నుంచి సీఎం రమేశ్, ధర్మవరం నుంచి సత్యకుమార్? ఏపీ బీజేపీ అభ్యర్థులు వీళ్లే?

Updated On : March 24, 2024 / 4:44 PM IST

AP Bjp Candidates List : ఏపీ బీజేపీ పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించి హైకమాండ్ లిస్టు దాదాపుగా ఫైనల్ చేసినట్లు సమాచారం. రాజమండ్రి నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పోటీ చేస్తారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అరకు పార్లమెంట్ టికెట్ కొత్తపల్లి గీతకు, అనకాపల్లి నుంచి సీఎం రమేశ్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా శ్రీనివాస వర్మ పేరుని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఒంగోలు లేదా రాజంపేట నుంచి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని బరిలోకి దింపాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. తిరుపతి నుంచి గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. వరప్రసాద్ తాజాగా వైసీపీ నుంచి బీజేపీ గూటికి చేరారు.

అసెంబ్లీ స్థానాల్లోనూ పలువురు సీనియర్లు రేసులో ఉన్నారు. విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా సుజనా చౌదరి పోటీ చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి, ధర్మవరం నుంచి సత్యకుమార్, విశాఖ నార్త్ నుంచి విష్ణుకుమార్ బరిలో ఉంటారని టాక్ నడుస్తోంది. ఇక రైల్వేకోడూరు, కైకలూరు, అనపర్తి, జడ్చర్ల, అనంతపురం సిటీ, చిత్తూరు జిల్లాలోని ఒక అసెంబ్లీ స్థానంలో కమలం పార్టీ పోటీ చేస్తుందని సమాచారం.

Also Read : వైసీపీ వ్యూహం ఏంటి? టీడీపీ ప్రణాళిక ఏంటి? ఏపీ లోక్‌సభ ఎన్నికల్లో ఎవరి సత్తా ఎంత?