బావతో అక్రమ సంబంధం… భర్త హత్య

బంధువుతో వివాహేతర సంబంధం వద్దన్నందుకు ఒక భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన తూర్పు గోదావరిజిల్లా ఏజెన్సీలో జరిగింది. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన మారేడు మిల్లి మండలం కూడురులో కత్తుల సోమిరెడ్డి (39) భార్య భవానీతో కలిసి జీవిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన సోమిరెడ్డి బంధువు కత్తుల సూర్యనారాయణరెడ్డితో భవానీ వివాహేతర సంబంధం పెట్టుకుంది. సూర్యనారాయణరెడ్డి భవానీకి వరుసకు బావ అవుతాడు.
భర్త సోమిరెడ్డికి తెలియకుండా వారిద్దరూ తరచూ కలుసుకుని లైంగిక కార్యకలాపాలు కొనసాగించేవాళ్లు. కొన్నాళ్లకు ఈ విషయం పసిగట్టిన సోమిరెడ్డి భవానీని ప్రశ్నించాడు. దీంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో భవానీ బుధవారం జూన్ 24 ఉదయం కోపంతో ఇంటి నుంచి వెళ్లిపోయి సమీపంలోని కొండపోడులో ఉంటున్న ప్రియుడు, కమ్ బావ అయిన కత్తుల సూర్యనారాయణరెడ్డి వద్దకు చేరుకుంది. భార్య భవానీ వెనుకాతలే సోమిరెడ్డి కూడా సూర్యనారాయణ రెడ్డి ఇంటికి చేరుకున్నాడు.
అక్కడ ముగ్గురి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో భవానీ, సూర్యనారాయణ రెడ్డి కలిసి సోమిరెడ్డి గొంతు నులిమి..కర్రతో కొట్టి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని సమీపంలోని అటవీ ప్రాంతంలో గోతిలో పడేశారు. ఇంటికి తిరిగి వచ్చి భవానీ తన భర్త కనపడటం లేదని గ్రామస్తులతో చెప్పింది. గ్రామస్తులందరూ కలిసి ఊరంతా కలిసి గాలించారు.
ఊరికి సమీపంలోనిలోయలో ఉన్న సోమిరెడ్డి మృతదేహాన్ని కొందరు గుర్తించారు. సమాచారం అందుకున్న మారేడుమిల్లి పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. భర్తశవం దొరికిందనేసమాచారం రాగానే భవాన ఆమెప్రియుడు సూర్యనారాయణ రెడ్డి లు గ్రామం నుంచి తప్పించుకుని పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
Read: ప్రియుడిపై మోజు..భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి చంపిన భార్య