భర్త హత్యకేసు విచారణ….ఇంతలోనే భార్య ఆత్మహత్య

భర్త హత్యకేసు విచారణ….ఇంతలోనే భార్య ఆత్మహత్య

Updated On : February 13, 2021 / 11:21 AM IST

wife suicide, after husband murder case under investigation in east godavari district : తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం లో ఈ నెల 8వ తేదీన హత్యకు గురైన రెడ్డెంశ్రీనివాస్ హత్య కేసు విచారణ జరుపుతుండగా …ఇంతలోనే ఆయన భార్య కూడా ఆత్మహత్య చేసుకోవటంతో వారి పిల్లలు అనాధలయ్యారు.

పట్టణంలోని శ్రీపాదవల్లభ మహా సంస్ధానం ఎదురుగా ఉన్న వీధిలో నివసించె రెడ్డం శ్రీనివాస్ (45) ను ఈ నెల8వ తేదీన గుర్తు తెలియని వ్యక్తులు మంచానికి కాళ్లు చేతులు కట్టేసి తలపై రాడ్డుతో దారుణంగా  కొట్టి  హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా ఫిబ్రవరి 12 శుక్రవారం మధ్యాహ్నం శ్రీనివాస్ భార్య స్వరూపరాణి (30) నీరసంగా ఉందని చెప్పి లోపలి గదిలోకి వెళ్లి పడుకుంది.

కొంతసేపటి తర్వాత కుటుంబ సభ్యులు చూస్తే ఆమె ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వెంటనే వారు పోలీసులకు సమచారం అందించారు. తండ్రి సత్తిరాజుతో కలిసి ఉమ్మడిగా వ్యవసాయం చేసుకునే శ్రీనివాస్ కు మొదట భార్య చనిపోవటంతో స్వరూప రాణిని రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య ద్వారా అతనికి ఇద్దరు పిల్లలు ఉండగా…స్వరూపరాణి ద్వారా ఒక కుమారుడు పుట్టాడు. ఐదురోజుల వ్యవధిలో భార్య భర్తలిద్దూర కన్నుమూయటంతో పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.