Andhra Pradesh : కూరలో విషం కలిపి మహిళను హత్య చేసిన అత్తింటి కుటుంబం

జూన్10వ తేదీన జ్యోతి అత్తింట్లో వివాదం నెలకొంది. వివాదం కారణంగా కక్ష పెట్టుకొని జ్యోతిని చంపాలని అత్తింటి కుటుంబం ప్లాన్ చేసుకుంది.

Andhra Pradesh : కూరలో విషం కలిపి మహిళను హత్య చేసిన అత్తింటి కుటుంబం

woman Killed

Updated On : June 23, 2023 / 9:32 AM IST

Woman Killed : ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లాలో దారుణం జరిగింది. కూరలో విషం కలిపి మహిళను అత్తింటి కుటుంబం హత్య చేసింది. ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంచికచర్లలో జ్యోతి అనే మహిళకు అత్తింటి కుటుంబం కూరలో విషం కలిపి ఇచ్చారు.

అది తిన్న జ్యోతి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పది రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జ్యోతి మృతి చెందారు. అయితే అంతకముందు చికిత్స పొందుతూ బాధితురాలు పోలీసులకు ఇచ్చిన వాగ్మోలంతో బయటకు వాస్తవాలు వచ్చాయి. భర్త హనుమంతరావు, మరిది కోటేశ్వరరావు, అత్త కలిసి కూరలో విషం కలిపారని వాగ్మూలం ఇచ్చారు.

France : భార్యకు ప్రతి రాత్రి మత్తు మందు ఇచ్చి.. పదేళ్లుగా పర పురుషులతో అత్యాచారం, ఆపై వీడియో రికార్డు చేసిన భర్త

ఈ ఘటనపై కంచికచర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. జ్యోతి భర్త, మరిది, అత్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూన్10వ తేదీన జ్యోతి అత్తింట్లో వివాదం నెలకొంది. వివాదం కారణంగా కక్ష పెట్టుకొని జ్యోతిని చంపాలని అత్తింటి కుటుంబం ప్లాన్ చేసుకుంది.

మరిది, అత్త కూరలో విషం కలిపి జ్యోతికి పెట్టారు. అనంతరం జ్యోతి అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స కోసం జ్యోతిని అత్తింటి కుటుంబo స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Southwest Monsoon : ఖమ్మం జిల్లాను తాకిన నైరుతి రుతుపవనాలు.. మూడు రోజులపాటు భారీ వర్షాలు

పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. పది రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జ్యోతి మృతి చెందారు. జ్యోతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పాయిజన్ కారణంగానే ఆమె చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు.