వైసీపీ 8వ జాబితా విడుదల.. ఇద్దరు లోక్‌సభ, ముగ్గురు అసెంబ్లీ ఇంచార్జుల పేర్లు ప్రకటన

YSRCP 8th List : వైసీపీ ఎనిమిదో జాబితా విడుదల చేసింది. ఇద్దరు లోక్ సభ, ముగ్గురు అసెంబ్లీ ఇంచార్జుల పేర్లను ప్రకటించింది.

వైసీపీ 8వ జాబితా విడుదల.. ఇద్దరు లోక్‌సభ, ముగ్గురు అసెంబ్లీ ఇంచార్జుల పేర్లు ప్రకటన

YCP 8th candidates list released and positions changed

YSRCP 8th List : ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే వైసీపీ ఎనిమిదో జాబితాను బుధవారం (ఫిబ్రవరి 28) విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన 8వ జాబితాలో కొందరు ఇంచార్జ్‌ల పేర్లను మారుస్తూ వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు లోక్ సభ, ముగ్గురు అసెంబ్లీ ఇంచార్జుల పేర్లను ప్రకటించింది. గుంటూరు లోక్ సభ ఇంచార్జుగా కిలారి రోశయ్య, ఒంగోలు లోక్ సభ ఇంచార్జుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్లను ఖరారు చేసింది వైసీపీ అధిష్టానం.

దాదాపు 60 మందికి పైగా నియోజకవర్గ ఇంచార్జుల పేర్లను వెల్లడించిన వైసీపీ.. తాజాగా అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఇన్‌ఛార్జ్‌లను ప్రకటిస్తూ 8వ జాబితాను ప్రకటించింది. కిలారి రోశయ్య సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అంబటి మురళిని పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్‌గా నియమించింది. కందుకూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్‌గా బుర్రా మధుసూదన్ యాదవ్ పేరును ఖరారు చేసింది.

నారాయణస్వామి కుమార్తెకు ఈసారి ఛాన్స్ :
అలాగే, జి.డి నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్‌గా కల్లత్తూర్ కృపాలక్ష్మికి వైసీపీ ఛాన్స్ ఇచ్చింది. ఇటీవలే గుంటూరు ఎంపీగా ఉమారెడ్డి వెంకటరమణను ప్రకటించగా.. ఆయన స్థానంలో అదే కుటుంబానికి చెందిన రోశయ్యను అభ్యర్థిగా ప్రకటించారు. జీడి నెల్లూరు వైసీపీ అభ్యర్థిని కూడా మళ్లీ మార్చింది.

జీడి నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న డిప్యూటీ సీఎం నారాయణస్వామిని చిత్తూరు పార్లమెంటుకు మార్చారు. ఈసారి నారాయణస్వామి కూతురుకు ఛాన్స్ ఇచ్చారు. ఈ జాబితాలో నారాయణస్వామికి బదులుగా ఆయన కుమార్తెకు వైసీపీ అధిష్టానం టికెట్ కేటాయించింది. కొత్త అభ్యర్థిగా కళత్తూరు కృపాలక్ష్మిని నియమించిన వైసీపీ.. గుంటూరు పార్లమెంటు సమన్వయకర్తను కూడా మార్చేసింది.