Badvel Bypoll : బద్వేల్ ఉపఎన్నిక.. వైసీపీ అభ్యర్థిగా సుధ

బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతితో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఇక ఈ స్థానం నుంచి వెంకట సుబ్బయ్య కుటుంబ సభ్యులు పోటీలో ఉండనున్నారు.

Badvel Bypoll : బద్వేల్ ఉపఎన్నిక.. వైసీపీ అభ్యర్థిగా సుధ

Badvel Bypoll

Updated On : September 28, 2021 / 6:48 PM IST

Badvel Bypoll : బద్వేల్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతితో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఇక ఈ స్థానం నుంచి వెంకట సుబ్బయ్య కుటుంబ సభ్యులకే టికెట్ ఇస్తామని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సుబ్బయ్య సతీమణి సుధ బద్వేల్ వైసీపీ అభ్యర్థిగా ఉంటారని వెల్లడించారు. చనిపోయిన వ్యక్తి కుటుంబం నుంచి టికెట్‌ ఇవ్వడం తమ సంప్రదాయమని సజ్జల తెలిపారు.

Read More : Posani Krishna Murali : పవన్ కళ్యాణ్ రాత్రి పదింటికి ఫోన్ చేసి తిట్టారు.. పోసాని

ఇక ఈ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకుంటామని వివరించారు. నంద్యాల ఎన్నికకు ఈ ఎన్నికకు పోలిక లేదని.. నంద్యాల ఉప ఎన్నికలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక పెద్ద జనరల్ ఎన్నికలుగా తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ ఎన్నికలు తమ ప్రభుత్వం గత రెండేళ్లలో చేసింది చెప్పుకోవడానికి ఇదొక అవకాశం. ప్రజల అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవడం మాకూ అవసరం. మెజారిటీ గతంలో వచ్చిన దానికంటే ఎక్కువ రావచ్చు అని సజ్జల అన్నారు.

Read More : Congress : హుజూరాబాద్ కాంగ్రెస్ షార్ట్ లిస్ట్ లో కొత్త పేర్లు