వైసీపీకి తొమ్మిదేళ్లు పూర్తి….ప్రజా నేతగా ఎదిగిన జగన్
వైసీపీకి నేటితో తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. ఇవాళ పదో వసంతంలోకి అడుగుపెట్టింది.

వైసీపీకి నేటితో తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. ఇవాళ పదో వసంతంలోకి అడుగుపెట్టింది.
వైసీపీకి నేటితో తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. ఇవాళ పదో వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వైసీపీ అధ్యక్షుడు,ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్..ఓ ట్వీట్ చేశారు. ఈ పదేళ్ల ప్రయాణంతో తన వెంట నడిచిన పార్టీ కుటుంబ సభ్యులకు, ఆదరించిన రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలంటూ పోస్ట్ చేశారు. ఏపీని ఆదర్శవంత రాష్ట్రంగా తీర్చిదిద్దేలా అందరి దీవెనలు పార్టీకి ఎల్లవేళ్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ ట్వీట్‌లో కోరారు. (టీడీపీకి వరుస షాక్‌లు… వైసీపీలో చేరనున్న కరణం బలరాం)
2011 మార్చి 12న వైసీపీ ఆవిర్భావం
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధనే ధ్యేయంగా 12, మార్చి 2011న వైసీపీ ఆవిర్భవించింది. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజానేతగా ఎదిగారు. ప్రజల సమస్యలను తెలుసుకుని, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ముందుకుసాగారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా సుదీర్ఘ పాదయాత్ర చేసి, ప్రజలలో మమేకం అయ్యారు.
2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం
గత ఏడాది జరిగిన ఎన్నికల్లో జనం ఆయనకు పట్టం కట్టారు. 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లను గెలుచుకుని ప్రభంజనం సృష్టించారు. ఇక ఇవాళ పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు.
See Also | బీజేపీ-జనసేన పొత్తు ఓటర్లను ఆకర్షిస్తుందా… నేడు ఉమ్మడి మేనిఫెస్టో విడుదల