ముప్పైయేళ్లు జగనే సీఎం.. పవన్ కల్యాణ్ పై ముద్రగడ ఫైర్
రాబోయే 30 సంవత్సరాలు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డే సీఎంగా ఉంటారని మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు.

Mudragada Padmanabham
Mudragada Padmanabham : రాబోయే 30 సంవత్సరాలు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డే సీఎంగా ఉంటారని మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. పార్టీ ఆదేశిస్తే ఏదైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని అన్నారు. శుక్రవారం సీఎం జగన్ సమక్షంలో ముద్రగడ తన కుమారుడు, పలువురు అనుచరులతో కలిసి వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. కాగా శనివారం కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎక్కువ మంది కార్యకర్తల తో కలిసి వెళ్దామనుకున్న.. కానీ, పిల్లల పరీక్షలు, సెక్యూరిటీ ఇబ్బందుల వల్ల వెళ్ళలేదని తెలిపారు. వైసీపీ ఆవిర్భావంలో నేను ఒకడిని.. ఎటువంటి కోరికలు, పదువులు ఆశించకుండా నేను పార్టీ సేవచేసేందుకు జగన్ సమక్షంలో వైసీపీలో చేరినట్లు ముద్రగడ తెలిపారు. బీజేపీ వాళ్లు ఫోన్ల మీద ఫోన్లు చేశారని ముద్రగడ అన్నారు.
Also Read : YSRCP Final Candidates List LIVE Updates: నేడు వైసీపీ అభ్యర్థుల తుది జాబితా.. LIVE Updates
నాకు కులం కాదు.. వర్గం ముఖ్యం
మా కుటుంబాలకు రాజకీయ బిక్ష పెట్టింది బీసీలు, దళితులు, కాలపులు ఐదుశాతం ఉంటారు. నేను రాజకీయాలకు రావడానికి కాపులు కారణం కాదు. నేను ఎవ్వరి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని ముద్రగడ అన్నారు. నాకు కులం కాదు ముఖ్యం.. నాకు వర్గం ముఖ్యం అని ముద్రగడ స్పష్టం చేశారు. కొందరు ఇష్టారీతిలో పోస్టులు పెడుతున్నారు. పోస్టింగ్ లు ఆపండి.. నాకు రాజకీయ బిక్ష పెట్టింది ప్రత్తిపాడు ప్రజలు. నేను ఏ ఉద్యమం చేసిన బీసీలు, దళితులే ఉన్నారు. కాపు ఉద్యమంలో ఎక్కువ మంది దళితులే ఉన్నారంటూ ముద్రగడ అన్నారు. మీకు నచ్చినట్లు రాజకీయాలు చెయ్యాలా? ఎందుకు చెయ్యాలి? అంటూ ముద్రగడ ప్రశ్నించారు.
Also Read : Delhi Excise Policy Case : ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు
సినిమాల్లో నేనే.. రాజకీయాల్లో నేనే..
సినిమాల్లోకి మొదట వచ్చింది నేను.. రాజకీయాల్లోకి మొదటి వచ్చిది నేనే. వాళ్లు సినిమాల్లో హీరో కావచ్చు.. నేను రాజకీయాల్లో హీరో.. అంటూ పవన్ కల్యాణ్ ను ఉద్దేశిస్తూ ముద్రగడ వ్యాఖ్యానించారు. సినిమా ఫీల్డ్ లో గొప్పవాళ్ళు కావచ్చు.. నేను రాజకీయాల్లో గొప్ప వాడినని ముద్రగడ అన్నారు. సినీ రంగంలో ఎన్టీఆర్ ను ప్రజలు నమ్మారు.. మరెవరినీ నమ్మరు. అయినా, రాష్ట్రంలో మొత్తం సీట్లు పోటీ చేయండి.. నేను సేవ చేస్తానని చెప్పా.. వారు వచ్చి అడిగితే నేనే వస్తాను అని చెప్పాను. సినిమావాళ్లు ఆరు నెలలకు ఒక్కసారి వస్తారు.. ప్రజలు నమ్మరు. త్వరలో జరగబోయే ఎన్నికల తరువాత జనసేన క్లోజ్ అవుతుందని ముద్రగడ అన్నారు.