Divvala Madhuri: రోడ్డు ప్రమాదంలో దివ్వెల మాధురికి తీవ్ర గాయాలు
ప్రమాద ధాటికి ఆమె కారు బోల్తా పడింది.

రోడ్డు ప్రమాదంలో దివ్వెల మాధురికి తీవ్ర గాయాలయ్యాయి. పలాస టోల్ గేట్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద ధాటికి ఆమె కారు బోల్తా పడింది. టెక్కలి నుంచి ఆమె పలాస వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దివ్వెల మాధురిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో దివ్వెల మాధురి సహజీవనం చేస్తోందని మండిపడుతూ ఆయన భార్య వాణి కొన్ని రోజులుగా మీడియా ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.
ప్రమాదం జరగడానికి ముందు దివ్వెల మాధురి మీడియాతో మాట్లాడుతూ పలు ఆరోపణలు చేశారు. దువ్వాడ శ్రీనివాస్ పై టీడీపీ కుట్ర పన్నుతోందని అన్నారు. దువ్వాడ శ్రీనివాస్ ని డీ ఫేం చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. బెజవాడ అంబేద్కర్ స్టాట్యూ వివాదాన్ని డైవర్ట్ చేయడానికి ఇలా ప్లాన్ చేశారని చెప్పుకొచ్చారు. దువ్వాడ ఉంటున్న ఇంటి నిర్మాణానికి తాను కూడా డబ్బు పెట్టానని అన్నారు.
తనను కాదని మరో మహిళ దివ్వెల మాధురితో తన భర్త శ్రీనివాస్ సహజీవనం చేస్తున్నాడని వాణిని దీక్షకు దిగిన విషయ తెలిసిందే. తమకు ఇద్దరు కూతుళ్లు ఉన్నప్పటికి తమతో ఉండకుండా దివ్వెల మాధురితో కలిసి శ్రీనివాస్ జీవిస్తున్నాడని వాణి అంటున్నారు.
Also Read: నా కుమార్తెపై లేనిపోని నిందలు వేస్తున్నారు: దువ్వాడ వాణి తండ్రి