నాపై తప్పుడు ఆరోపణలు చేసిన ఎవర్నీ వదలను.. నేను పంతం పడితే ఎలా ఉంటుందో చూపిస్తా : విజయసాయిరెడ్డి

నాపై తప్పుడు ప్రచారం చేసిన వారిలో వైసీపీ వాళ్లయినా, ఇతర పార్టీల వాళ్లయినా వదిలి పెట్టేది లేదని విజయసాయిరెడ్డి హెచ్చరించారు.

నాపై తప్పుడు ఆరోపణలు చేసిన ఎవర్నీ వదలను.. నేను పంతం పడితే ఎలా ఉంటుందో చూపిస్తా : విజయసాయిరెడ్డి

ycp mp vijaya sai reddy

Updated On : July 15, 2024 / 1:01 PM IST

Vijaya sai Reddy : ఏపీలో మధ్యంతర ఎన్నికలు వస్తే మళ్లీ అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అని వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన తరువాత హద్దులు దాటిన వాళ్ల తోకలు కత్తిరించడం ఖాయమని హచ్చరించారు. రాష్ట్రంలో టీడీపీ గూండాలు, కార్యకర్తలు అకృత్యాలు పెరిగిపోయాయి. దాడులు కారణంగా కుటుంబాలకు కుటుంబాలే ఊళ్లు వదిలిపోతున్నారని విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేనా ప్రభుత్వం పనితీరు. రాష్ట్రంలో నెల రోజుల్లో రాక్షస పాలనను ప్రజలు గమనిస్తున్నారు. అధికార పార్టీ పతనం స్టార్ట్ అయిందని విజయసాయిరెడ్డి అన్నారు.

Also Read : కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇచ్చిన తీహార్ జైలు అధికారులు.. బరువు ఎంత తగ్గాడంటే?

వైసీపీ నేతలపై నిరాధార ఆరోపణలు, బురద జల్లడం ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతోంది. నా పరువు తీసేందుకు ప్రయత్నం చేశారు. టీడీపీ వాళ్లతో కుమ్మక్కై మా పార్టీ వాళ్లే నా మీద ఆరోపణలు చేయించారు. నాపై తప్పుడు ప్రచారం చేసిన వారిలో వైసీపీ వాళ్లయినా, ఇతర పార్టీల వాళ్లయినా వదిలి పెట్టేది లేదంటూ సాయిరెడ్డి హెచ్చరించారు. నిన్న మా ఇంటికి ఒక తెలుగుదేశం గూండా వచ్చి విజయసాయిరెడ్డి ఎక్కడ అని అడిగాడట. నేను సెక్యూరిటీ లేకుండా ప్రజల్లో తిరుగుతున్నాను. నా ఇంటికి వచ్చి బయపెట్టే తాటాకు చప్పుళ్లకు లొంగేది లేదు. సాయిరెడ్డి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించే మనిషి కాదు. తప్పు చేయను. వేంకటేశ్వర స్వామికి తప్ప ఎవ్వరికీ భయపడను. మూడు రోజులుగా మీడియా ట్రోలింగ్, కథనాలతో ఒక ఆదివాసీ మహిళను అవమానించారు. నిరాధారమైన వార్తలు రాయడం జర్నలిజం విలువలకు విరుద్ధం. ఇది ఘోరమైన తప్పిందం.

Also Read : Pawan Kalyan – Chandrababu : అంబానీతో సహా ప్రముఖులందరికి.. దగ్గరుండి పవన్ కళ్యాణ్‌ని పరిచయం చేసిన చంద్రబాబు..

నామీద దారుణంగా కథనాలు రాసిన వాళ్లతో ఎలా క్షమాపణలు చెప్పించాలో నాకు తెలుసు. నామీద వారి కుట్రలు బయటపెడతాను. విజయసాయిరెడ్డి పంతం పడితే ఎలా ఉంటుందో చేసి చూపిస్తాను. పార్లమెంట్ లో ప్రివిలేజ్ మోషన్ తో పాటు చట్టబద్ధమైన అన్ని సంస్థలకు ఫిర్యాదులు చేస్తాను. పరువు నష్టం దావావేసి న్యాయపోరాటం చేస్తానని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. త్వరలోనే న్యూస్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. గతంలోనే ప్రకటించిన.. ఆలస్యం చేసినందుకు బాధపడుతున్నాను. ఎవరు అడ్డువచ్చిన ఛానల్ ఏర్పాటులో వెనక్కి తగ్గేది లేదు. కులాలకు, మతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఆ ఛానల్ నిర్వహిస్తానని విజయసాయిరెడ్డి అన్నారు. తప్పులు చేసేవాళ్లను వదలం. ప్రజల అవసరాలకోసం ప్రభుత్వ ఆస్తుల రక్షణకోసం పనిచేశాను. ఎటువంటి చర్యలకు అయినా సిద్ధమని విజయసాయిరెడ్డి అన్నారు.