పబ్జీ గేమ్‌కు లక్ష రూపాయలు కట్టాడు, భయంతో పారిపోయిన 16 ఏళ్ల కుర్రాడు

  • Published By: murthy ,Published On : August 24, 2020 / 07:40 AM IST
పబ్జీ గేమ్‌కు లక్ష రూపాయలు కట్టాడు, భయంతో పారిపోయిన 16 ఏళ్ల కుర్రాడు

Updated On : August 24, 2020 / 11:47 AM IST

స్మార్ట్ ఫోన్ లలో ఉండే గేమ్ లకు పిల్లలు ఎంతలా ఎడిక్ట్ అవుతున్నారో రోజూ చూస్తూనే ఉన్నాము. యానాంలోని ఒక బాలుడు పబ్జీ గేమే కు డబ్బులు ఖర్చు పెట్టి భయంతో పారిపోయాడు. ఇంతవరకు బాలుడి ఆచూకి లభించక తల్లి తండ్రులు ఆందోళన చెందుతున్నారు.



యానాంలోని దోబీ వీధికి చెందిన బాలుడు (16) పబ్జీ గేమ్ కు అలవాటు పడ్డాడు. ఇతని ఖాతాలో తండ్రి వేసిన రూ.1.05 లక్షలను ఆటకోసం ఖర్చు పెట్టాడు. ఈ విషయం ఇంట్లో తల్లి తండ్రులకు తెలిస్తే ఏమంటారోనని భయపడ్డాడు.



ఆగస్ట్ 20వ తేదీన ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయి తిరిగిరాలేదు. దీంతో బాలుడి తల్లి శనివారం ఆగస్ట్ 22న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి ఆచూకి కోసం గాలిస్తున్నారు.