పార్టీ కీలక నేతలతో జగన్ అత్యవసర సమావేశం..

పార్టీలో తాజా పరిస్థితులపై ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

పార్టీ కీలక నేతలతో జగన్ అత్యవసర సమావేశం..

Updated On : September 19, 2024 / 6:09 PM IST

Ys Jagan Key Meeting : పార్టీ నేతలంతా ఒక్కొక్కరిగా దూరం అవుతుండటంతో వైసీపీ అధిష్టానం అప్రమత్తమైంది. కీలక నేతలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. వైవీ సుబ్బారెడ్డితో పాటు కీలక నేతలతో తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో జగన్ సమావేశం అయ్యారు. నేతలు పార్టీ వీడటంపై చర్చిస్తున్నారు.

బాలినేని రాజీనామా అంశంతో పాటు టీటీడీ లడ్డూ ప్రసాదం వివాదంపై డిస్కస్ చేస్తున్నారు. ఇప్పటికే బాలినేని వైసీపీకి రాజీనామా ప్రకటించగా, మరో మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. వీరిద్దరూ జనసేనలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీలో తాజా పరిస్థితులపై ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Also Read : జంతువుల కొవ్వుతో..! తిరుమల లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయభానుల వ్యవహారం వైసీపీలో కలకలం రేపింది. దీనిపై చర్చించేందుకు పార్టీ కీలక నేతలతో సమావేశమయ్యారు జగన్. వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతర ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా బాలినేని రాజీనామా తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. ఒంగోలు జిల్లాలోని వైసీపీ క్యాడర్, ద్వితీయ శ్రేణి నేతలు, కార్పొరేటర్లు, మాజీ ఎమ్మెల్యేలు.. వీరంతా బాలినేని వెంట వెళ్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వారందరిని కంట్రోల్ చేసే బాధ్యతను వైవీ సుబ్బారెడ్డికి జగన్ అప్పగించే అవకాశం ఉంది.

ఒంగోలులో పార్టీని, కేడర్ ని, నేతలను ఏ విధంగా కాపాడుకోవాలి అనేదానికి సంబంధించి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు జగన్. ఇప్పటికే కార్పొరేటర్లు 20 మంది బాలినేని వెంట వెళ్తామంటున్నారు. మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు ఎవరూ బాలినేని వెంట వెళ్లకుండా ఉండేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు జగన్. ఏ విధంగా ముందుకెళ్లాలి అనే దానిపై చర్చ జరుగుతోంది.

అటు మరో మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సైతం వైసీపీని వీడనున్న నేపథ్యంలో జగ్గయ్యపేటలో ఉన్న పరిస్థతులపై జగన్ చర్చిస్తున్నారు. ఇప్పటికే జగ్గయ్యపేట మున్సిపాలిటీకి సంబంధించి కౌన్సిలర్లు అందరూ టీడీపీలో చేరిపోయారు. మున్సిపాలిటీని వైసీపీ కోల్పోయిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో జగ్గయ్యపేటలో కేడర్ ను ఏ విధంగా కాపాడుకోవాలని అనే దానిపై పార్టీ కీలక నేతలతో జగన్ డిస్కస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు తిరుమల లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు చేసిన సంచలన ఆరోపణల అంశంపైనా పార్టీ నేతలతో జగన్ చర్చిస్తున్నారు.

వ్యక్తులు పార్టీని వీడితే వాళ్ల ప్లేస్ ను ఏ విధంగా రీప్లేస్ చేయాలి, అక్కడున్న కేడర్ ను, ద్వితీయ శ్రేణి నేతలను ఏ విధంగా మోటివేట్ చేయాలి అన్న అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. నేతలు వెళ్లిపోయినా కేడర్ చాలా ముఖ్యం. దీంతో కేడర్ ను కాపాడుకునేందుకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనేదానిపై వైఎస్ జగన్ డిస్కస్ చేస్తున్నారు.