TTD Laddu row: తిరుమలలో జగన్ అందుకే డిక్లరేషన్‌ ఇవ్వాలి: మంత్రి ఆనం

తమ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, అన్నీ చట్ట ప్రకారం జరగాల్సిందేనని..

TTD Laddu row: తిరుమలలో జగన్ అందుకే డిక్లరేషన్‌ ఇవ్వాలి: మంత్రి ఆనం

Anam Ramanarayana Reddy

Updated On : September 27, 2024 / 2:35 PM IST

Anam Ramanarayana Reddy: తిరుపతిలో మాజీ సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. డిక్లరేషన్ ఇవ్వకుంటే టీటీడీలోకి అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరించారు.

తమ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, అన్నీ చట్ట ప్రకారం జరగాల్సిందేనని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని, హైందవ ధర్మంలో డిక్లరేషన్ ఒక ప్రక్రియ అని చెప్పారు. ఇది ఆగమ పండితులు రచించిన విధానమని, హిందూ సాంప్రదాయాలు మత విశ్వాసాలను గౌరవించడం కోసమే డిక్లరేషన్ అని తెలిపారు.

వైసీపీ పాలనలో దీన్ని పట్టించుకోకపోవచ్చని, ఇప్పుడు అలాంటివి కుదరవని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. తమ ప్రభుత్వం ఆయా విధానాలను గౌరవిస్తుందని తెలిపారు. కాగా, జగన్ తిరుమల పర్యటనపై పలువురు నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

Prakash Raj: తిరుపతి లడ్డూ వివాదం.. ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్.. ఈసారి కాస్త డోస్ పెంచాడు..