ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన షర్మిల.. జగన్‌పై కీలక వ్యాఖ్యలు
రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయింది. పది సంవత్సరాలైనా రాష్ట్రం ఎక్కడ మొదలైందో ఇప్పటికికూడా అలానే ఉంది. ప్రతేక హోదా రాలేదు...
YS Sharmila : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నివాళులర్పించారు. షర్మిలతోపాటు కాంగ్రెస్ పార్టీ నేతలు తులసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రాజశేఖర్ రెడ్డి మరణించారు. రాజశేఖర్ రెడ్డి మరణ వార్త తట్టుకోలేక 700 మంది మరణించారని గుర్తు చేసుకున్నారు. రాజశేఖర్ రెడ్డితో పాటు చనిపోయిన వారందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ నివాళులర్పిస్తున్నానని షర్మిల అన్నారు. ప్రజలకోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని షర్మిల అన్నారు.
Also Read : వైఎస్ఆర్ వర్ధంతి.. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన జగన్
రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయింది. పది సంవత్సరాలైనా రాష్ట్రం ఎక్కడ మొదలైందో ఇప్పటికికూడా అలానే ఉంది. ప్రతేక హోదా రాలేదు, కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజశేఖర్ రెడ్డి కల, మిగిలిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేయలేదు. కడప నుంచి జగన్ ముఖ్యమంత్రి అయిఉండి కూడా స్టీల్ ఫ్యాక్టరీని నిర్మించలేకపోయారని షర్మిల విమర్శించారు. పాలకులు ప్రజలకు మేలు చేయడానికి ఆలోచించండి. రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని షర్మిల స్పష్టం చేశారు.