Ys Vivekananda Case : వివేకా పీఏ కృష్ణారెడ్డి ఇంటికి సీబీఐ అధికారులు .. పులివెందులలో ఏం జరుగుతోంది..?!
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దూకుడు పెంచిన సీబీఐ అధికారులు పులివెందుల పరిసరాల్లోనే ఎక్కువగా ఉంటున్నారు. . ఓ వైపు అరెస్టులు..మరోవైపు విచారణల పేరుతో నిందితులకు చుక్కలు చూపిస్తున్న సీబీఐ పులివెందులలో దస్తగిరి ఇంటికెళ్లటంతో ఈరోజు వివేకా పీఏ ఇంటికెళ్లటం వెనుక కారణమేంటీ? ఈ హత్య కేసులో ఇప్పటికే వైఎస్ అవినాశ్ రెడ్డిని సీబీఐ ఏ క్షణమైనా అరెస్టుకు రెడీగా ఉన్న క్రమంలో అసలు పులివెందులలో ఏం జరుగుతోంది?

YS Viveka PA Krishna reddy
Ys Vivekananda Case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దూకుడు పెంచిన సీబీఐ నిందితులకు చుక్కలు చూపిస్తోంది. ఓ వైపు అరెస్టులు..మరోవైపు విచారణల పేరుతో నిందితుల నుంచి కీలక విషయాలు రాబడుతోంది. వివేకా హత్య కేసులో ఇప్పటికే వైఎస్ కుటుంబ సభ్యులు కీలక నిందతులుగా ఉన్నారు. వైసీపీ ఎంపీ వైఎస్ కుటుంబానికి చెందిన వైఎస్ అవినాశ్ రెడ్డిని సీబీఐ ఏ క్షణమైనా అరెస్టు చేయటానికి సిద్ధంగా ఉంది.
ఈక్రమంలో సీబీఐ అధికారులు పులివెందులలోని వైఎస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి ఇంటికి చేరుకున్నారు. అతనిని విచారించటానికా? లేదా నోటీసులు ఇవ్వటానికా?లేక మరేదైనా కారణమా?అనేది ఆసక్తికరంగా మారింది. 30 ఏళ్లుగా వివేకా వద్ద పనిచేస్తున్న కృష్ణారెడ్డిని విచారించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసు విషయంలో కృష్ణారెడ్డి గతంతో తనకు ప్రాణహాని ఉందంటూ అనంతపురం జిల్లా ఎస్పీ ఫరకీరప్పకు ఫిర్యాదు చేశారు. వైఎస్ సునీతా, ఆమె భర్త తనను బెదిరిస్తున్నారని..సీబీఐ అధికారులు తనపై ఒత్తిడి తెస్తున్నారటూ ఎస్సీకి ఫిర్యాదు..అలాగే పులివెందుల కోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై సీబీఐ అధికారులు కృష్ణారెడ్డిపై అసహనం వ్యక్తంచేశారు. కృష్ణారెడ్డికి పిటీషన్ వేసే అర్హత లేదన్నారు.
కాగా ఈకేసులో ఇప్పటికే అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి చంచల్ గూడ జైలులో ఉన్నారు. ఏ క్షణమైనా అవినాశ్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి అదే జైలుకు తరలించేందుకు రెడీగా ఉన్నారు సీబీఐ అధికారులు..ఈక్రమంలో వివేక హత్య కేసులో ఏ1 నిందితుడుగా ఎర్రగంగిరెడ్డి బయటే ఉండి బెయిల్ కోసం పిటీషన్ వేశారు. దీనిపై విచారణ చేసిన తెలంగాణ హైకోర్టు ఎర్రగంగిరెడ్డి బెయిల్ పిటీషన్ రద్దు చేసింది. సాక్ష్యాలు తారుమారు చేసిన కేసులో 2019 మార్చి 28 అరెస్టు అయిన ఎర్ర గంగిరెడ్డి
ఆ తరువాత బెయిల్ పై బయటకొచ్చారు. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలనిగతంలో సుప్రీంకోర్టు ,తెలంగాణా కోర్టును ఆశ్రయించారు సీబీఐ అధికారులు. దీంతో ఎర్రగంగిరెడ్డి బెయిల్ పిటీషన్ ను తెలంగాణ కోర్టు రద్దు చేసిది.మే 5లోగా సీబీఐ కోర్టుముందు లొంగిపోవాలని ఆదేశించింది. లొంగకపోతే అరెస్ట్ చేయాలని సీబీఐకు ఆదేశించింది.
కాగా.. ముందస్తు బెయిల్ పిటీషన్ తో కాలయాపన చేసిన అవినాశ్ రెడ్డిని సీబీఐ ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవటం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో అవినాశ్ రెడ్డి పులివెందులలో తన క్యాడర్ తో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కడపలో పర్యటిస్తున్నారు. అలాగే సీబీఐ అధికారులు కూడా పులివెందులలోనే ఉండటం రెండు రోజుల క్రితం అవినాశ్ రెడ్డి బెయిల్ పిటీషన్ వాయిదా పడిన తరువాత ఆయన పులివెందులకు వచ్చేసరికే సీబీఐ అధికారులు పులివెందులకు చేరుకున్నారు.
అనూహ్యంగా ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి ఇంటికెళ్లి మరీ అతని భద్రత గురించి అడిగి తెలుసుకున్నారు. దస్తగిరి చెప్పిన వివరాలతో అవినాశ్ రెడ్డికి నోటీసులు, భాస్కర్ రెడ్డి అరెస్ట్ వంటి కీలక విషయాలు ఈ కేసులో కొనసాగుతున్న క్రమంలో సీబీఐ అధికారుల బృందం పులివెందులలోని వివేకా పీఏగా పనిచేసిన కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లటం ఆసక్తికరంగా మారింది. ఇటువంటి కీలక పరిణామాల మధ్య అసలు పులివెందులలో ఏం జరుగుతోంది అనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. మరోపక్క అవినాశ్ రెడ్డి అరెస్ట్ పై ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు అవినాశ్ అరెస్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవటంపై ఉత్కంఠ నెలకొంది.