వైఎస్సార్ అర్బన్ క్లినిక్ లు, 355 కొత్త భవనాలు

  • Published By: madhu ,Published On : November 25, 2020 / 08:10 AM IST
వైఎస్సార్ అర్బన్ క్లినిక్ లు, 355 కొత్త భవనాలు

Updated On : November 25, 2020 / 8:39 AM IST

YSR Urban Clinics : ఏపీలో వైఎస్సార్‌ అర్బన్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేసేందుకు వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 560 వైఎస్సార్ అర్బన్ క్లినిక్‌లకు సర్కార్ అనుమతులు ఇచ్చింది. క్లినిక్‌ల కోసం 355 కొత్త భవనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 205 భవనాలకు మరమ్మతులు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. వైఎస్సార్‌ క్లినిక్‌ల నిర్మాణానికి జాతీయ ఆరోగ్య మిషన్, రాష్ట్ర ఆరోగ్యశాఖ నుంచి ప్రభుత్వం నిధులు మంజూరు చేయనుంది.



ఈ అర్బన్ క్లినిక్‌లు ఢిల్లీలోని మొహల్లా క్లినిక్ తరహాలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో సామాన్య ప్రజలు జ్వరం, చిన్నాచితక రోగాలు వస్తే ప్రయివేట్ హాస్పిటళ్లకు వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టే పరిస్థితి ఉండదు. పేదలకు వైద్యం భారం కావొద్దనే ఉద్దేశంతో కేజ్రీవాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు ఉండదు. అంతేకాదు మందులు, వైద్య పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహిస్తారు. ఇదే తరహాలో ఏపీలోనూ వైఎస్సార్ అర్బన్ క్లినిక్‌లు పని చేస్తాయి. ఇవి ప్రస్తుతం ఏపీలోని పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు. తర్వాతి దశలో గ్రామాల్లో విస్తరిస్తారని తెలుస్తోంది.