AP New Cabinet : పల్నాడులో నిరసనలు-మంటల్లో దూకుతానన్న కార్యకర్త

పల్నాడు జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే మాచర్ల నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన పిన్నెల్లి రామకృష్ణరెడ్డికి మంత్రివర్గంలో చోటుకల్పించనందుకు నిరసనలు వెల్లువెత్తాయి.

AP New Cabinet : పల్నాడులో నిరసనలు-మంటల్లో దూకుతానన్న కార్యకర్త

ysrcp cadre protest palnadu

Updated On : April 10, 2022 / 6:35 PM IST

AP New Cabinet :  పల్నాడు జిల్లా నుంచి   పిన్నెల్లికి   కేబినెట్ లో మంత్రి పదవి దక్కకపోవటంతో   ఆయన వర్గీయులు  నిరసనలు చేపట్టారు.  మాచర్ల  నియోజకవర్గం నుండి నాలుగు  సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన పిన్నెల్లి రామకృష్ణరెడ్డికి మంత్రివర్గంలో చోటుకల్పించనందుకు  కార్యకర్తలు ధర్నా చేపట్టారు.

మండల కేంద్రమైన రెంటచింతల లో ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు పై టైర్లు తగలపెట్టారు. ఈ రాస్తారోకో నిరసన కార్యక్రమంలో మాచర్ల నియోజకవర్గం మహిళ నాయకురాలు పాముల సంపూర్ణమ్మ మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు. వెంటనే తేరుకున్న మిగిలిన వైసీపీ నేతలు ఆమెను అడ్డుకుని వెనక్కు తీసుకువెళ్లారు.

Also Read : Ministers Gudivada Dadisetti : జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం, నమ్మకాన్ని వమ్ము చేయం- మంత్రులు గుడివాడ, దాడిశెట్టి రాజా