మండలిలో ఫొటోలు, దాడులు.. నారా లోకేష్ పై ఫిర్యాదు చేయనున్న వైసీపీ
ఏపీ శాసనమండలిలో మంటలు కొనసాగుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ పై ఫిర్యాదు చేసేందుకు వైసీపీ

ఏపీ శాసనమండలిలో మంటలు కొనసాగుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ పై ఫిర్యాదు చేసేందుకు వైసీపీ
ఏపీ శాసనమండలిలో మంటలు కొనసాగుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ పై ఫిర్యాదు చేసేందుకు వైసీపీ సిద్ధమైంది. మండలిలో లోకేష్ ఫొటోలు తీశారని ఆరోపిస్తున్న వైసీపీ… ఎథిక్స్ కమిటీకి ఆయనపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. ఈ రోజు లేదా రేపు ఫిర్యాదు చేయనుంది. మరోవైపు మంత్రి లోకేష్ తో పాటు మంత్రి వెల్లంపల్లిపై దాడి చేసిన ఎమ్మెల్సీలపైనా ఫిర్యాదు చేయాలని వైసీపీ నిర్ణయించింది. గతంలో ఓసారి ఇలానే మండలిలో ఫొటోలు, వీడియోలు తీశారు నారా లోకేష్. అలా చేయడం నిబంధనలకు విరుద్ధం అని లోకేష్ కు చెప్పారు. అయినా లోకేష్ లో మార్పు లేదు. మరోసారి నిబంధనలకు విరుద్ధంగా మండలిలో ఫొటోలు తీసిన లోకేష్ పై ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేయాలని అధికార పార్టీ నిర్ణయించింది.
మండలిలో బాహాబాహీ:
ఇటీవలే శాసన మండలి సమావేశం జరిగింది. మండలిలో చర్చ జరుగుతుండగా లోకేష్ ఫొటోలు తీస్తున్నారు. దీనిపై ప్రశ్నించేందుకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ లోకేష్ వైపు వెళ్లారు. ఆ సమయంలో తనపై దాడి జరిగిందని మంత్రి వెల్లంపల్లి ఆరోపించారు. వెల్లంపల్లిపై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్సీలపైనా అధికార పార్టీ నేతలు ఎథిక్స్ కమిటీకి కంప్లయింట్ చేయనున్నారు.
మంత్రిపై దాడి జరిగిందని ఆరోపణ:
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(2020-21) సమావేశాల్లో భాగంగా జూన్ 17న రెండో రోజు శాసనమండలి సమావేశాల్లో షాకింగ్ ఘటనలు చోటుచేసుకున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ సభ్యులు సభలో తన్నుకున్నారు. రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ను టీడీపీ ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర, మంతెన సత్యనారాయణ రాజు కొట్టినట్లు వైసీపీ నేతలు ఆరోపించారు. ఓ వైపు సభ జరుగుతుంటే టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ నిబంధనలకు విరుద్ధంగా మండలిలో సభ్యుల ఫొటోలు తీస్తున్నారని, దీన్ని ప్రశ్నించేందుకు ముందుకెళ్లిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై టీడీపీ సభ్యులు దాడి చేశారని అధికార పార్టీ నేతలు ఆరోపణలు చేశారు. ఉద్దేశపూర్వకంగా సభను అడ్డుకునేందుకు టీడీపీ నేతలు కుట్రపూరితంగా వ్యవహరించారని, కావాలనే బిల్లులను అడ్డుకున్నారని మండిపడ్డారు.
Read: మాజీమంత్రి గంటా ప్రధాన అనుచరుడు అరెస్ట్