వైసీపీ ఎమ్మెల్యే కన్నుమూత

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ గుంతోటి వెంకటసుబ్బయ్య సోమవారం(28 మార్చి 2021) తెల్లవారుజామున కన్నుమూశారు.

వైసీపీ ఎమ్మెల్యే కన్నుమూత

Mla

Updated On : March 28, 2021 / 9:15 AM IST

MLA Gunthoti Venkata Subbaiah:వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ గుంతోటి వెంకటసుబ్బయ్య సోమవారం(28 మార్చి 2021) తెల్లవారుజామున కన్నుమూశారు. డాక్టర్ వెంకటసుబ్బయ్య కడప జిల్లా బద్వేలు (ఎస్సీ) నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు. వెంకటసుబ్బయ్య కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతుండగా.. సోమవారం మరణించారు.

ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య మృతిపట్ల ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని నివాసం నుంచి జగన్మోహన్ రెడ్డి.. వెంకటసుబ్బయ్య కుటుంబసభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు.

వెంకటసుబ్బయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య సంధ్య కూడా డాక్టర్ కాగా.. కూతురు హేమలత, ఎంబీబీఎస్‌ చదువుతోంది. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారానే వెంకటసుబ్బయ్య రాజకీయ రంగప్రవేశం చేశారు. క్రియాశీలకంగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో తొలిసారి అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు.