ఏపీ హోంమంత్రి ఇంటి ముందు వైసీపీ కార్యకర్తల ధర్నా, అసలేం జరిగింది
స్థానిక సంస్థల ఎన్నికలు ఏపీ హోం మంత్రికి తలనొప్పిగా మారాయి. నియోజకవర్గంలోని విభేదాలు ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. ఏకంగా కార్యకర్తలు ఆమె ఇంటి ముందే ధర్నాకి

స్థానిక సంస్థల ఎన్నికలు ఏపీ హోం మంత్రికి తలనొప్పిగా మారాయి. నియోజకవర్గంలోని విభేదాలు ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. ఏకంగా కార్యకర్తలు ఆమె ఇంటి ముందే ధర్నాకి
స్థానిక సంస్థల ఎన్నికలు ఏపీ హోం మంత్రికి తలనొప్పిగా మారాయి. నియోజకవర్గంలోని విభేదాలు ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. ఏకంగా కార్యకర్తలు ఆమె ఇంటి ముందే ధర్నాకి దిగటం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. దీని వెనుక కారణాలేంటి? అసలు ఏం ప్రత్తిపాడులో ఏం జరుగుతోంది?
ప్రత్తిపాడు వైసీపీలో బయటపడ్డ లుకలుకలు:
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి హోంమంత్రి సుచరిత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే ఆమె మూడుసార్లు విజయం సాధించారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటనతో పార్టీలోని లుకలుకలు బయటపడ్డాయి. ఆమె నియోజకవర్గంలో రెండు చోట్ల ఆమె ఎదుటే కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పెద నందిపాడు మండలం రేటూరు ఆలయ ట్రస్ట్ బోర్డు విషయంలో కార్యకర్తలు ఆమె ఎదుటే ఘర్షణకు దిగారు. ఆరే నరేంద్ర, చిరంజీవి వర్గాలకు నచ్చజెప్పడంతో వివాదం సమసిపోయింది. ఏడాది క్రితం పార్టీలోకి వచ్చిన నరేంద్రకు ప్రాతినిధ్యం ఇవ్వటాన్ని చిరంజీవి వర్గం వ్యతిరేకించింది. ఆలయ బోర్డు విషయంలోనూ నరేంద్ర జోక్యాన్ని వ్యతిరేకిస్తూ చిరంజీవి వర్గం మంత్రి ముందే ఘర్షణకు దిగింది. ఈ వివాదం రాష్ట్ర వ్యాప్త చర్చకు దారి తీసింది.
సుచరిత ఇంటి ముందు ధర్నాకు దిగిన నల్లపాడు గ్రామ కార్యకర్తలు:
మంత్రి సుచరిత ఎదుటే ఇరు వర్గాలకు చెందిన నేతలు కేకలు వేసుకోవడం, ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం చర్చనీయాంశమయ్యాయి. ఈ ఘటన మర్చిపోక ముందే ఈ మధ్యనే గుంటూరు కార్పొరేషన్‌లో కలిసిన నల్లపాడు గ్రామానికి చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆమె ఇంటి ముందు ధర్నాకు దిగారు. కార్పొరేషన్‌లోని 27వ వార్డు కార్పొరేటర్ టికెట్ అంజిరెడ్డికి ఇవ్వడాన్ని తప్పు పడుతూ వందల సంఖ్యలో కార్యకర్తలు ఆమె ఇంటిని ముట్టడించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి కాకుండా నాయకులకు ఇష్టమైన వారికి టికెట్లు ఇస్తున్నారంటూ ఆరోపించారు. అంజిరెడ్డిపై రౌడీ షీట్ ఉందని, అటువంటి వారికి ఎలాగా టికెట్లు ఇస్తారంటూ కార్యకర్తలు ప్రశ్నించారు.
రౌడీషీటర్లను పార్టీలో చేర్చుకోవడంపై కార్యకర్తల ఆగ్రహం:
మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడతున్న వారికి టికెట్లు ఇవ్వకుండా మోసం చేస్తున్నారంటూ కార్యకర్తలు ఆగ్రహిస్తున్నారు. హోంమంత్రి ఇంటి ముందు అంత పెద్ద ఎత్తున కార్యకర్తలు గుమికూడటంతో కలకలం రేగింది. అయితే సకాలంలో పోలీసులు స్పందించి కార్యకర్తలందరినీ పంపించి వేశారు. ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు సుచరిత ప్రయత్నం చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు రౌడీ షీటర్లు, పలు స్టేషన్లలో సస్పెక్ట్ షీట్ ఉన్న వారిని సైతం పార్టీలో చేర్చుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. కొంతమంది అక్రమ వ్యాపారులకు కండువాలు కప్పి పార్టీలో చేర్చుకోవడంతో పోలీసులు అవాక్కవుతున్నారట.
పోలీసు అధికారులకు తప్పని బెదిరింపులు:
హోంమంత్రి మనుషులం అంటూ స్టేషన్లలో పంచాయితీలు చేస్తున్నారట. చివరకు పోలీసు అధికారులను సైతం బెదిరిస్తున్నారట. ఈ రెండు ఘటనలు పార్టీలోని లుకలుకలను బయటపడేలా చేశాయి. ఇదే అంశం ముఖ్యమంత్రి జగన్ వద్దకు చేరిందని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికే టికెట్లు ఇవ్వాలన్న డిమాండ్ చేస్తున్నారు. మరి పార్టీ పెద్దలు ఈ విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందేనంటున్నారు.
Also Read | షట్ డౌన్ పొడిగించినా కూడా….ఉన్న నిల్వలతో ఏడాదిన్నర పాటు పేదలకు ఆహారం అందిచవచ్చు