Malladi Vishnu : బాలకృష్ణ, లోకేశ్‌లపై ఈసీకి వైసీపీ ఎమ్మెల్యే ఫిర్యాదు

ఎన్నారైలు రాష్ట్రంపై ప్రేమతో సేవ చేయాలన్నారు. రాజకీయ ప్రయోజనాలకు సహకరించటం సరికాదని హితవు పలికారు.

Malladi Vishnu : బాలకృష్ణ, లోకేశ్‌లపై ఈసీకి వైసీపీ ఎమ్మెల్యే ఫిర్యాదు

Malladi Vishnu

Updated On : April 17, 2024 / 8:00 PM IST

Malladi Vishnu : టీడీపీ నేతలపై సీఈవోకు ఫిర్యాదు చేశారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. టీడీపీ నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలకష్ణ, లోకేశ్, టీడీపీ మద్దతు మీడియా కోడ్ ఉల్లంఘించదని ఈసీకి ఫిర్యాదు చేశామని మల్లాది విష్ణు వెల్లడించారు. ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. సీఎం జగన్ ఇమేజ్ ని డామేజ్ చేసేలా బాలకృష్ణ మాట్లాడారని విరుచుకుపడ్డారు.

సీఎం గురించి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేసినా.. టీడీపీ నేతల తీరు మారలేదని ధ్వజమెత్తారు. బుద్ది లేకుండా అసభ్యకరపదజాలం వాడుతున్నారని విరుచుకుపడ్డారు. హిందూపురం ముఖమే చూడని బాలకృష్ణ.. స్వర్ణాంధ్ర యాత్ర చేయటం సిగ్గుచేటు అని విమర్శించారు మల్లాది విష్ణు.

సీఎస్ పై తప్పుడు కధనాలు రాయటం సరికాదన్నారు. ఎన్నారైలు పేదల ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఎన్నారైల తీరును ఖండిస్తున్నామని మల్లాది విష్ణు అన్నారు. ఎన్నారైలు రాష్ట్రంపై ప్రేమతో సేవ చేయాలన్నారు. రాజకీయ ప్రయోజనాలకు సహకరించటం సరికాదని హితవు పలికారు.

Also Read : వైసీపీ కంచుకోటలో హైవోల్టేజ్ ఫైట్.. ఈసారి అందలమెవరికో?