YSRCP Twitter Account: వైసీపీ ట్విటర్ అకౌంట్ హ్యాక్.. రాత్రి నుంచి ట్విటర్ పేజీలో క్రిప్టో పోస్టులు
వైఎస్ఆర్ సీపీ ట్విటర్ హ్యాండిల్‌ను కొందరు హ్యాక్ చేయడంతో వెంటనే ఆ పార్టీ డిజిటల్ విభాగం గమనించింది. హ్యాక్ అయిన తరువాత వైసీపీకి సంబంధించిన పోస్టులు కాకుండా ఇతర పోస్టులు వచ్చాయి.

YCP Twitter Account
YSRCP Twitter Account: ఏపీలో అధికార పార్టీ వైసీపీ నిర్వహిస్తున్న ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయింది. రాత్రి నుంచి ఆ అకౌంట్‌లో కొత్త ట్వీట్లు పెడుతున్నారు. పార్టీ కార్యకర్తలు ఈ ట్వీట్లు చూసి అవాక్కయ్యారు. హ్యాకర్లు ట్విటర్ అకౌంట్ ప్రొఫైల్ పిక్, కవర్ పిక్ లను మార్చేశారు. శుక్రవారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. NFT Millionarie పేరుతో వైఎస్సార్‌సీపీ ట్విట్టర్ ఖాతాను మార్చేశారు. ఖాతా పేరు కింద మాత్రం Ysr Coongress Party పేరును అలాగే ఉంచారు.
వైఎస్ఆర్ సీపీ ట్విటర్ హ్యాండిల్‌ను కొందరు హ్యాక్ చేయడంతో వెంటనే ఆ పార్టీ డిజిటల్ విభాగం గమనించింది. హ్యాక్ అయిన తరువాత వైసీపీకి సంబంధించిన పోస్టులు కాకుండా ఇతర పోస్టులు వచ్చాయి. ఎలాన్ మస్క్ ఫొటోతో కూడిన పోస్ట్ ఒకటి వైసీపీ ట్విటర్ ఖాతాలో ప్రత్యక్ష్యమైంది. ఇందులో క్రిప్టో పెట్టుబడులకు సంబంధించిన మెస్సేజ్ ఉంది. రెగ్యూలర్ గా వైసీపీ ట్విటర్ ఖాతాను ఫాలో అయ్యే అభిమానులు ఉదయాన్నే ఈ విచిత్రమైన పోస్టులనుచూసి అవాక్కయ్యారు.
Pawan kalyan : జనసేన ’వారాహి’ వాహనం రంగుపై వైసీపీ విమర్శలకు పవన్ కల్యాణ్ కౌంటర్
ట్విటర్ అకౌంట్ హ్యాక్ కావడంతో వైసీపీ డివిజన్ విభాగం అప్రమత్తమైంది. ఈ ఘటనపై ట్విటర్ యాజమాన్యానికి వైసీపీ ఐటీ సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఇదిలాఉంటే గతంలో ఇలానే టీడీపీ ట్విటర్ అకౌంట్ కూడా హ్యాక్ అయిన విషయం తెలిసిందే. టీడీపీ పోస్టులకు బదులుగా విజువల్ ఆర్ట్స్ పోస్టులు కనిపించాయి. వెంటనే ట్విటర్ ను స్పందించిన ఐటీ టీం మళ్లీ అకౌంట్ ను పునరుద్దరించారు.