Ap Congress Candidates List : ఏపీ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు వీరే
గంగాధర నెల్లూరు నుంచి రమేశ్ బాబు, పూతలపట్టు నుంచి ఎంఎస్ బాబు ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు.

Ap Congress Second List
Ap Congress Candidates List : ఏపీ కాంగ్రెస్ రెండో జాబితా విడుదలైంది. 6 పార్లమెంట్, 12 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. విశాఖ ఎంపీ అభ్యర్థిగా పులుసు సత్యనారాయణ రెడ్డి, అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి వేగి వెంకటేశ్ బరిలోకి దిగుతున్నారు. ఏలూరు నుంచి లావణ్య కావూరి, నరసరావుపేట నుంచి అలెగ్జాండర్ సుధాకర్, నెల్లూరు నుంచి కొప్పుల రాజు, తిరుపతి నుంచి చింతా మోహన్ ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఇక టెక్కలి అసెంబ్లీ అభ్యర్థిగా కిల్లి కృపారాణి బరిలోకి దిగుతున్నారు.
భీమిలి నుంచి వెంకట వర్మ రాజు, విశాఖ సౌత్ నుంచి వాసుపల్లి సంతోశ్, గాజువాక నుంచి లక్కరాజు రామారావు, అరకు వ్యాలీ నుంచి గంగాధర స్వామి, నర్సీపట్నం నుంచి శ్రీరామమూర్తి, గోపాలపురం నుంచి మార్టిన్ లూదర్, ఎర్రగొండపాలెం నుంచి అజిత్ రావు, పర్చూరు నుంచి శివ శ్రీలక్ష్మి జ్యోతి, సంతనూతలపాడు నుంచి విజేశ్ రాజ్, గంగాధర నెల్లూరు నుంచి రమేశ్ బాబు, పూతలపట్టు నుంచి ఎంఎస్ బాబు ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు.
Also Read : ఆ ఇద్దరిలో ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా చరిత్రే.. భీమిలిలో గురు శిష్యుల మధ్య రసవత్తర పోరు