Vijayasai Reddy : ఏపీలో పెరిగిన పోలింగ్ శాతం.. విజయసాయిరెడ్డి ఏమన్నారంటే..
ఓటర్లకు డబ్బులు పంచినా.. ప్రజలు వైసిపికి పట్టం కట్టబోతున్నారు. జిల్లాలో వైసిపి గెలవడం కోసం అందరం కలిసి పనిచేశాం.

Vijayasai Reddy (Photo Credit : Facebook, Google)
Vijayasai Reddy : ఏపీ ఎన్నికల్లో అత్యధిక శాతం ఓటింగ్ నమోదైందని నెల్లూరు వైసిపి ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి తెలిపారు. అధిక శాతం ఓటింగ్ నమోదైతే ప్రభుత్వానికి వ్యతిరేకం అని చెబుతున్నారు. కానీ, అది నిజం కాదని ఆయన అన్నారు. ప్రజలు సంక్షేమ పథకాలు మళ్ళీ తీసుకోవాలనే ఉద్దేశ్యంతో వైసిపిని మళ్ళీ గెలిపించుకోబోతున్నారు అని కామెంట్ చేశారు.
”85శాతం మందికిపైగా సంక్షేమ పథకాలు అందుకున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి డబ్బుతోనే రాజకీయం చేయాలని చూశారు. 100కి 100 శాతానికి పైగా డబ్బు పంచామని.. ఓటింగ్ శాతం 60కి మించలేదని టీడీపీ వాళ్లే అంటున్నారు. జిల్లాలో అన్ని సీట్లు గెలవబోతున్నాము. జిల్లాను అభివృద్ధి చేస్తాం. నెల్లూరు సిటీ అభ్యర్థి ఖలీల్.. నారాయణ మీద గెలవబోతున్నారు.
కోవూరు, నెల్లూరు సిటీ నియోజకవర్గాల్లో ఓటర్లకు డబ్బులు పంచినా.. ప్రజలు వైసిపికి పట్టం కట్టబోతున్నారు. జిల్లాలో వైసిపి గెలవడం కోసం అందరం కలిసి పనిచేశాం. నెల్లూరు జిల్లాలో ఇంత శాతం ఓటింగ్ రావడం సంతోషం. ప్రజలు సంక్షేమ పథకాలు మళ్ళీ తీసుకోవాలనే ఉద్దేశ్యంతో వైసిపిని మళ్ళీ గెలిపించుకోబోతున్నారు. నెల్లూరులో రౌడీయిజాన్ని అణగదొక్కుతాం. నెల్లూరు జిల్లాలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, రూప్ కుమార్ యాదవ్ రౌడీయిజం సహించం. నారాయణ ఆటలు ఇక సాగవు” అని విజయసాయిరెడ్డి హెచ్చరించారు.
Also Read : ప్రజలు జగన్‌ను మరోసారి దీవిస్తారు, అందుకు ఇదే నిదర్శనం- కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు