Ugadi 2025: షష్టగ్రహ కూటమి అంటే ఏమిటి? సమస్యలు వస్తాయా? బంగారయ్య శర్మ వివరణ
"పంచాంగం అంటే ఐదు అంగాలు అని అర్థం. కాలానికి ఐదు అంగాలు ఉన్నాయి. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం ఉంటాయి" అని చెప్పారు.

ఉగాది వేళ తత్వ చారిటేబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బంగారయ్య శర్మ 10టీవీతో మాట్లాడారు. విశ్వావసు నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా విశ్వావసు నామ ఉగాది విశిష్టత గురించి తెలిపారు. “మన జీవితంలో కూడా ఆరే రుచులు ఉంటాయి. అంటే, కోపం, అసూయ, దయ, జాలి వంటి లక్షణాలు అంటాయి” అని అన్నారు.
“ఉగాది అంటే యుగ ఆది. ఈ రోజున బ్రహ్మ దేవుడిని పూజించాలి. రుద్రుడిన, సూర్యనారాయణుడిని పూజించాలి. పంచాగ పఠనం, పంచాంగ శ్రవణం చేయాలి” అని చెప్పారు.
Also Read: అరె.. ఏంటి ఇది? అంటూ మ్యాచ్‌లో కోహ్లీ తీవ్ర ఆగ్రహం.. ఆ తర్వాత అంపైర్..
“షష్టగ్రహ కూటమి అంటే ఆరు గ్రహాలు ఒకే దగ్గర ఉంటాయి. అవి మీనరాశిలో ఉంటాయి. మనకు గురువు వృషభ రాశిలో ఉన్నాడు. కేతువు కన్యారాశిలో ఉన్నాడు, కుజుడు మిధున రాశిలో ఉన్నాడు. ఈ విధంగా మిగతా గ్రహాలన్నీ ఒకే దగ్గర ఉన్నాయి.
అది అంత శ్రేయస్కరం కాదు. కానీ, ఉగాదికి రాజు సూర్యుడై ఉండడంతో ఆ దోషాలు ఏవీ పనిచేయవు. మన దేశం సుభిక్షంగా ఉంటుంది. షష్టగ్రహ కూటమి ఒకటిన్నర రోజులు ఉంటుంది. ఆ తర్వాత 13 రోజులు పంచ గ్రహ కూటమి ఉంటుంది.
అప్పటి వరకు యోగ్యం మంచిది కాదు. అయినప్పటికీ గ్రహరాట్ ఉండడం వల్ల విశేషంగా ఉంటుంది. షష్టగ్రహ కూటమి వచ్చిందని మనం బెంగపడే అవసరం లేదు. పంచాంగం అంటే ఐదు అంగాలు అని అర్థం. కాలానికి ఐదు అంగాలు ఉన్నాయి. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం ఉంటాయి” అని చెప్పారు.