CSK vs RCB: అరె.. ఏంటి ఇది? అంటూ మ్యాచ్‌లో కోహ్లీ తీవ్ర ఆగ్రహం.. ఆ తర్వాత అంపైర్‌..

పతిరనకు వార్నింగ్‌ ఇచ్చి వదిలేశారు.

CSK vs RCB: అరె.. ఏంటి ఇది? అంటూ మ్యాచ్‌లో కోహ్లీ తీవ్ర ఆగ్రహం.. ఆ తర్వాత అంపైర్‌..

Pic: @BCCI

Updated On : March 28, 2025 / 9:20 PM IST

ఐపీఎల్‌ 2025లో భాగంగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్‌ జరిగింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ టాస్‌ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది.

ఈ మ్యాచ్‌ జరుగుతున్న వేళ సీఎస్కే బౌలర్ పతిరన బౌలింగ్‌లో బాల్‌ తన హెల్మెట్ పై తాకిందంటూ ఆర్సీబీ బ్యాటర్‌ కోహ్లీ మైదానంలోనే అసంతృప్తి వ్యక్తం చేశాడు. బాల్ చాలా హైట్‌కు వెళ్లిందని, దాన్ని వైడ్‌గా ప్రకటించాలని అంపైర్‌ను కోహ్లీ డిమాండ్ చేశాడు. అయితే, అంపైర్ వైడ్‌ ఇవ్వలేదు. పతిరనకు వార్నింగ్‌ ఇచ్చి వదిలేశారు. అనంతరం కోహ్లీ వెనువెంటనే సిక్స్, ఫోర్ బాదాడు. ఆ ఒక్క ఓవర్‌లోనే ఆర్సీబీకి 16 రన్స్‌ తీసింది.

కాగా, ఈ మ్యాచులో పిలిప్ సాల్ట్‌ 32, విరాట్ కోహ్లీ 31, దేవదత్ పడిక్కల్ 27, రజత్ పాటిదార్ 51, లియామ్ లివింగ్‌స్టోన్ 10, జితేశ్ శర్మ 12, టిమ్ డేవిడ్ 22 (నాటౌట్), కృనాల్ పాండ్యా 0, భువనేశ్వర్ కుమార్ 0 (నాటౌట్) పరుగులు చేశారు. 20 ఓవర్లలో ఆర్సీబీ స్కోరు 196-7గా నమోదైంది.

చెన్నై జట్టు: రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), దీపక్ హుడా, సామ్ కుర్రాన్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, మాథీషా పాతిరానా, ఖలీల్ అహ్మద్

ఆర్సీబీ జట్టు: విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, దేవ్దట్ పదుక్కల్, రజత్ పటీదార్ (కెప్టన్), లిమ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హజ్లేవోడ్, యష్ డేలేవోడ్