Today Horoscope: నేటి రాశి ఫలాలు.. నేడు ఈ రాశి వారు ఏది ముట్టుకున్నా విజయమే..!
ఈ రోజు (ఆదివారం, అక్టోబర్ 13, 2024) ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో.. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన నేటి 12 రాశుల ఫలితాల వివరాలు...

జోతిష్యం అంటే మీ భవిష్యత్తు గురించిన సూచన. చాలామంది వ్యక్తులు భవిష్యత్తును దైవికంగా చెప్పడానికి జాతకం నిజమైన మార్గమని నమ్ముతారు. మీ రాశి ఫలాలు ఇవాళ ఈ కింది విధంగా ఉన్నాయి. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ వీటిని అందించారు. ఇవాళ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో, మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి..
శ్రీ క్రోధి నామ సంవత్సర ఆశ్వీజ మాస శుద్ధ దశమి: ఉ 9:08, దనిష్ఠ : రాతె 2:51 ఆదివారము ఈ రోజు ద్వాదశ రాశుల ఫలితాలు
మేష రాశి: అనుకున్న పనులు నెరవేరుతాయి, అన్ని పనులలో విజయం, ఉద్యోగంలో సంతృప్తి, ప్రయాణములు చేయడం, చికాకులు తగ్గుతాయి, వ్యాపార రంగంలో అభివృద్ధి, విద్యార్థులకు బాగుంటుంది., శుభకార్యక్రమములు నిర్వహించుట, నూతన వ్యాపారములలో విజయం సాధించడం: విశ్వనాథాష్టకం చదవవలెను శుభం జరుగుతుంది.
వృషభ రాశి: సంతాన సమస్యలు, బంధుమిత్రులతో సహనంగా ఉండాలి, విరోధములు పెట్టుకోకూడదు, ఆరోగ్యం మెరుగుపడుతుంది, ప్రతి పనిలో విజయం సాధించడం, బుణబాధలు తగ్గడం, మనఃశాంతి లేకపోవడం, అనవసరపు విషయముల వైపు వెళ్ల కూడదు, ధనము విషయంలో జాగ్రత్త అవసరం: ఆంజనేయస్వామి ఆరాధన చేసినచో ఉత్తమ పలితములు కలుగుతాయి.
మిథున రాశి: అజీర్ణ వ్యాధులు, అనారోగ్యము, నిద్రలేమి, ప్రమాదాలు, వివాదములు, చికాకులు, జాయింటు వ్యాపారాలు కలిసి రావడం, నూతన వస్తువులు కొనడం, ధనలాభం, వృధా సంచారం, సరియైన నిర్ణయము తీసులేకపోవడం: గోవును పూజించవలెను శుభం కలుగుతుంది.
కర్కాటక రాశి:కుటుంబంలో ఆనందం, గౌరవాభివృద్ధి, సమస్త భోగ భాగ్యములు, ధనము ఆదాయం కలసి రావడం, శరీర సుఖము, స్త్రీ సుఖము, ప్రయాణముల వలన లాభము, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు: గణపతి ఆరాధన చేయవలను మంచి జరుగుతుంది.
సింహ రాశి: అన్ని పనులలో విజయం, దీర్ఘకాలిక రోగముల ద్వారా బాధలు, భార్యభర్తల మధ్య సమస్యలు, విజయ ప్రాప్తి, అర్థం పర్థం లేని విషయములు, వివాదములు, కోర్టు సమస్యలు, ప్రయాణములతో బాధలు, తీర్ధయాత్రలు, అనాలోచిత చర్యలు: శ్రీలక్ష్మీనరసింహ స్తోత్రం పారాయణం చేయవలెను శుభం కలుగును.
కన్యా రాశి:మంచి విషయాలు తెలుసుకోవడం, క్రీడల యందు ఆసక్తి, ఋణములు లభించడం, మానసిక వేదన, మంచి శుభవార్తలు, శరీరంలో రుగ్మతలు, వస్త్రములు కొనుగోలు, సందిగ్ద స్థితులు, ప్రత్యేక విషయముల మీద దృష్టి పెట్టాలి: కార్తికేయస్తోత్రం పారాయణం చేయవలెను.
తులా రాశి:ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి, కుటుంబంలో వివాదం రాకుండా చూసుకోవాలి, మిత బాసిగా ఉండాలి, నిర్ణయములలో జాగ్రత్త, మోసములకు గురి కాకుండా ఉండాలి, వస్తువులు కొనుగోలు, మానసిక బాధలు వెంటాడుతూ ఉంటాయి, స్త్రీలు ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి: సుందర కాండ పారాయణము చేయడం వల్ల ఉత్తమ ఫలితములు
వృశ్చిక రాశి:వృత్తి ఉద్యోగాలలో అనుకూలం, ధనలాభం, నూతన వ్యాపారములు, పెట్టుబడిదారులు రావడం, ఆరోగ్యం కుదుటపడుతుంది, మంచి ఆలోచనలు, శుభవార్తలు వినడం, విధ్యార్థులకు అనుకూలం: గణపతి పంచరత్న స్తోత్ర పారాయణం చేసినచో శుభం జరుగుతుంది.
ధనస్సు రాశి: ప్రతి విషయము జాగ్రత్తగా ఆలోచించాలి, ధనలాభము, మానసిక స్థితి విషయంలో జాగ్రత్త అవసరము, ధనము విషయంలో కలసి రావడం, స్త్రీ సుఖము, స్నేహితుల ద్వారా లాభములు, చిరు వ్యాపారముల వారికి లాభములు, స్థాన చలనము: శివ ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితములు వస్తాయి.
మకర రాశి:కుటుంబంలో ఆనందం, విలువైన వస్తువులు కొనుగోలు, ఋణ బాధలు తగ్గుతాయి, ధన వృత్తి విషయంలో అభివృద్ధి కలుగును, పుణ్యక్షేత్రములు, బంధు మిత్రులతో విందులు వినోదములు, అభివృద్ధి కలుగును, నూతన ఆలోచనలు: దుర్గా ఆరాధన చేయడం వల్ల ఉత్తమ ఫలితములు కలుగుతాయి.
కుంభ రాశి:అనవసరపు మాటలు, ఇతరుల వలన గొడవలు, ప్రమాదములు రాకుండా జాగ్రత్తపడవలెను, బద్దకం పెరగకూడదు, లౌకికంగా ఉండాలి, మధ్యవర్తిత్వం పనికి రాదు, ఇష్టదైవ ఆరాధనవలన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి
మీనా రాశి: శుభవార్తలు వినడం, మంచి ఆలోచనలు చేయడం, ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం, లాభదాయకమైన ప్రయాణములు చేయడం, బాధ్యతలు పెరగడం, విలువైన ఆస్తులు సంపాదించడం, స్థానచలనం, మానసిక వేదన: శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన వలన మంచి పలితములు కలుగుతాయి.
— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ
Contact: 9849280956, 9515900956