Holi 2025
Holi 2025 : భారత్‌లో హోలీ పండుగకు చాలా ప్రత్యేకత ఉంది. హోలీ పండుగను రంగుల పండుగ అని కూడా పిలుస్తారు. దేశంలోని అతిపెద్ద పండుగలలో ఇదొకటి. సాధారణంగా మార్చిలో జరుపుకునే ఈ పండుగ తేదీ చంద్రుని మార్పుపై ఆధారపడి ఉంటుంది. హోలీ అనేది పూర్ణిమ లేదా ఫాల్గుణ మాసంలో వస్తుంది. పౌర్ణమి రోజున రాత్రిపూట హోలీ పండుగను జరుపుకుంటారు.
వాస్తవానికి, హోలీ రెండు రోజుల పండుగ. మొదటి రోజు హోలికా దహన్ జరుపుకుంటారు. రెండో రోజు హోలీతో ప్రారంభమవుతుంది. హోలికా దహన్ రోజున భోగి మంటలు వెలిగిస్తారు. చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది. అదే రోజున శ్రీకృష్ణుడు, రాధను పూజిస్తారు. హోలీ సరైన తేదీ, సమయం వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా దేశవ్యాప్తంగా హోలీ పండుగ జరుపుకుంటారు. అయితే, కొన్ని ప్రాంతాలలో వేర్వేరు సంప్రదాయాలు పాటిస్తారు. బర్సానాలోని లాథ్మార్ హోలీ నుంచి బృందావన్‌లోని ఫూలోన్ వాలి హోలీ, శాంతినికేతన్‌లోని బసంత ఉత్సవ్, ఉదయపూర్‌లోని హోలికా దహన్ వంటి ఇతర పండుగల వరకు పండుగ సంప్రదాయాలు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి.
హోలీ 2025 తేదీ, సమయం :
పంచాంగం ప్రకారం.. ఈ సంవత్సరం హోలీని శుక్రవారం, మార్చి 14, 2025న జరుపుకుంటారు. కానీ, మార్చి 15వ తేదీన హోలీ అంటున్నారు. కానీ, పూర్ణిమ తిథి మార్చి 13, 2025న ఉదయం 10:35 గంటలకు ప్రారంభమై మార్చి 14, 2025న మధ్యాహ్నం 12:23 గంటలకు ముగుస్తుంది. పూర్ణిమ తిథి ప్రారంభమైన తర్వాత మార్చి 13, 2025 గురువారం హోళికా దహనం జరుగుతుంది.
హోలీ ప్రాముఖ్యత :
హిందూ పురాణాలలో ఈ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హోలిక అనే రాక్షసిపై ప్రహ్లాదుడి విజయానికి ప్రతీకగా జరుపుకుంటారు. హిరణ్యకశపుడి ఏకైక కుమారుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు. అది తండ్రి హిరణ్యకశపుడికి అసలు నచ్చదు. ప్రహ్లాదుడిని చంపేయాలని అనుకుంటాడు. తన రాక్షస సోదరి అయిన హోళికతో ప్రహ్లాదుడిని సంహరించాలని భావిస్తాడు.
హోళిక తన శక్తితో ప్రహ్లాదుడిని మంటల్లో ఆహుతి చేయాలని చెబుతాడు. ప్రహ్లాదుడిని ఆమె తన ఒడిలో కూర్చోబెట్టి మంటల్లోకి దూకుతుంది. విష్ణు లీలతో ప్రహ్లాదుడికి ఏమి కాదు. కానీ, హోళిక రాక్షసి మంటల్లో దహనం అవుతుంది. అలా హోలిక దహనమైన రోజునే ‘హోలీ’ పండుగగా పిలుస్తారు. కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళ ‘హోలిక’ దహనం జరుపుకుంటుంటారు.
Read Also : Smart SIP Tips : మీకు జీతం పడిందా? రూ. 15వేల పెట్టుబడితో 30 ఏళ్లలో రూ. 10 కోట్లకుపైగా సంపాదించుకోవచ్చు!
ఇందులో మత విశ్వాసం, ధర్మంతో పాటు శక్తిని సూచిస్తుంది. ఈ పండుగ ఐక్యతను గుర్తుచేస్తుంది. అన్ని వర్గాల ప్రజలు రంగులతో ఆడుకోవడానికి, స్వీట్లు పంచుకోనేందుకు ఒక వేదికగా చెప్పవచ్చు. అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే పండుగ కూడా. హోలీ అనేది రంగుల గురించి మాత్రమే కాదు.. ప్రేమ, మత విశ్వాసాలతో సామాజిక అడ్డంకులను తొలగించి ఐక్యత, సామరస్యాన్ని పెంపొందించే రంగుల పండుగ హోలీగా చెప్పవచ్చు.