ధన త్రయోదశి రోజు ఇలా చేయండి.. డబ్బుల సంచులు వద్దన్నా వచ్చేస్తాయ్..

ఇవి ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్లేనని భావిస్తారు.

ధన త్రయోదశి రోజు ఇలా చేయండి.. డబ్బుల సంచులు వద్దన్నా వచ్చేస్తాయ్..

Gold

Updated On : October 12, 2025 / 6:00 PM IST

Dhantrayodashi: ధన త్రయోదశి ఈ ఏడాది అక్టోబర్ 18న వస్తుంది. ఈ రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి హిందువులు పలు పనులు చేస్తే మంచిదని నమ్ముతారు. బంగారం, వెండి, చీపుర్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల వంటివి కొనాలి.

అలాగే, అన్నదానం చేయడం, యమదీపం పెడితే సంపద పెరుగుతుంది. ఆకలితో ఉన్నవారికి, పేదలకు ఆహారం పెట్టాలి. గోవులకు, మూగ జీవాలకు కూడా ఆహారం అందిస్తే చాలా పుణ్యం వస్తుంది. (Dhantrayodashi)

Also Read: ధన్ తేరస్ తర్వాత ఈ 6 రాశుల వారికి డబ్బే డబ్బు.. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి..

సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు యమదీపం వెలిగించాలి. దీని వల్ల సర్వ మృత్యు దోషాలు తొలగిపోతాయి. మీ ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది. ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవిని ఆరాధిస్తే సంపద, శ్రేయస్సు లభిస్తాయి.

మీ ఆర్థిక స్తోమతను బట్టి వస్త్రాలను దానం చేస్తే మంచిది. ధన త్రయోదశికి మట్టి ప్రమిదలను కొనుగోలు చేయాలి. గోమతి చక్రాలను కొనుగోలు చేస్తే మంచిది. ఇవి ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్లేనని భావిస్తారు.

లక్ష్మీదేవికి ఇష్టమైన గవ్వలను కొనుగోలు చేయాలి. లక్ష్మీదేవికి శంఖం అంటే కూడా ఇష్టం. కాబట్టి దాన్ని ఇంటికి తీసుకువెళ్తే లక్ష్మీదేవి ఆశీస్సులు కలుగుతాయి. మీ ఆర్థిక సమస్యలు తీరతాయి. గణేశుడు, లక్ష్మీదేవి ఉన్న ఫొటోను కొనండి.